- త్వరలో ప్రారంభం కానున్న పనులు
మంగళగిరి(చైతన్యరథం): మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి నియోజక వర్గంలోని మూడు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.9.86 కోట్ల నిధులు మంజూర య్యాయి. ఈ క్రమంలో త్వరలో పనులు మొదలుపెట్టనున్నారు. దుగ్గిరాల-కొల్లిపర్ర, ఉండవల్లి-యర్రబాలెం వయా పెనుమాక రోడ్డు, దుగ్గిరాల-పెదపాలెం రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ఈ నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. గుంటూరు జిల్లా లోని దుగ్గిరాల-కొల్లిపర్ర మధ్య 4 కి.మీ రోడ్డు అభివృద్ధికి రూ.2.86 కోట్లు, ఉండవల్లి-యర్రబాలెం వయా పెనుమాక రోడ్డుకు సంబంధించి 6.45 కి.మీ రోడ్డు అభివృద్ధికి రూ. 5 కోట్లు, దుగ్గిరాల-పెదపాలెం మధ్య 3 నుంచి 6.2 కి.మీ వరకు రోడ్డు అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించారు. ఈ నిధుల విడుదలతో మంగళగిరి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి శరవేగంగా జరగనుంది. మంత్రి నారా లోకేష్ చొరవతో ఇప్పటికే నియోజకవర్గంలోని రోడ్లపై గుంతలు పూడ్చి ప్రయాణికుల కష్టాలు తీర్చారు. తాజాగా ఈ నిధుల విడుదలతో ఆయా గ్రామాల మధ్య రోడ్ల అభివృద్ధితో రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని తీవ్ర నిర్లక్ష్యం చేసింది. గుంతలతో అనేక మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. నిధుల కొరత పేరిట రోడ్ల వైపు కన్నెత్తి చూడకపోగా రోడ్లు, భవనాల శాఖకు చెందిన స్థిరాస్తులను సైతం తాకట్టు పెట్టింది. రోడ్ల సమస్యపై నాటి ప్రజాప్రతినిధులు, అధికా రుల దృష్టికి ప్రజలు, ప్రజా సంఘాలు తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసింది. అలాగే రోడ్ల విస్తరణకు కార్యా చరణ మొదలు పెట్టింది.