- ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన గాదె శ్రీనివాసులుకు శుభాకాంక్షలు
అమరావతి (చైతన్యరథం): ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడుకు తెలుగుదేశం పార్టీ తరపున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో వచ్చిన ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారంలో మా కూటమి ప్రభుత్వం అన్నివేళలా సహకరిస్తుందని తెలియజేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీకానీ, కూటమికానీ పోటీ చేయలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ ఫలితాన్ని టీడీపీ, కూటమి ఓటమిగా అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండిరచారు. ఫేక్ ప్రచారాలతో వాస్తవాలను దాచలేరని వైసీపీ నేతలు తెలుసుకోవాల్సిన అవసరం ఇకనైనా ఉందని పల్లా హితవు పలికారు.