- ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్
- రెండేళ్లలో వెలుగొండ పూర్తి చేసి నీళ్లిస్తాం
- మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
ఒంగోలు(చైతన్యరథం): పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుం దని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా పేదల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతున్నామని తెలి పారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గార్లపేట గ్రామంలో శనివారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందన్నారు. గార్లపే టలో సిమెంటు రోడ్డు కావాలని ప్రజలు కోరారని, పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ రోడ్డును మంజూరు చేసి త్వరగా నిర్మించామని మంత్రి చెప్పారు. సిమెంట్ రోడ్డుతో పాటు గ్రామంలో అవసరమైన విద్యుత్ సౌకర్యాన్ని కూడా కల్పించి శివరాత్రి రోజున నిజమైన పండుగ నింపామని తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్యకు మూడేళ్లలో శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు. కమ్యూనిటీ హాలు త్వరలోనే నిర్మిస్తామని తెలిపారు. అర్హులందరికీ ఇల్లు మంజూరు చేస్తామని, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు.
వివిధ కార్పొరేషన్ల ద్వారా జీవనోపాధి కోసం అర్హులకు పశువులను కూడా ఇప్పిస్తామ న్నారు. అర్హులైన పశుపోషకులకు గోకులం షెడ్లు ఇస్తున్నామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో బీపీటీ బియ్యంతో విద్యార్థులకు భోజనం పెడతామన్నా రు. స్థానికంగా ఉన్న చిన్నారుల కోసం మినీ అంగన్వాడీ ఏర్పాటుకు చర్యలు తీసుకో వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పాఠశాలకు విద్యార్థులు వెళ్లి వచ్చేందుకు ఎలక్ట్రిక్ ఆటోను కూడా సమకూరుస్తామని తెలిపారు. మహిళలందరినీ స్వయం సహా యక సంఘాల గ్రూపులలో చేర్పించాలని డీఆర్‌డీఏ అధికారులకు మంత్రి స్పష్టం చేశా రు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని గ్రామంలో ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాకు తలమానికమైన వెలుగొండ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని ప్రకటించారు.