- తగిన కార్యాచరణతో ముందుకురావాలి
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచన
- సెర్ఫ్ అధికారులు, కంపెనీలతో సమీక్ష
అమరావతి(చైతన్యరథం): స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాదులు, రైతు ఉత్పత్తి సంస్థల (ఎఫ్‌పీఓల) సభ్యుల ఉత్పత్తులకు విలువ జోడిరచి అధిక ఆదాయం పొందేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం సచివాలయం ఐదో బ్లాక్‌లోని తన కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు, ఫాంవేద, మిల్లెట్ బ్యాంక్, క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సర్వీస్, ఫ్లిప్ కార్ట్ కంపెనీలతో మంత్రి సమీక్ష నిర్వ హించారు. స్వయం సహాయ సంఘాల మహిళలు వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారని, వాటికి విలువ జోడిరచి అత్యధిక ఆదాయం పొందేందుకు తీసు కోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. ఇందుకు అవసరమైన తగిన కార్యాచ రణతో ముందుకు రావాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి సంస్థలు తయారుచేసిన ఉత్పత్తులకు అత్యధిక ధర పొందేందుకు తగిన కార్యాచరణతో ముందుకుసాగాలని సూచించారు. ఈ సందర్భంగా ఫామ్ వేద, మిల్లెట్ బ్యాంక్, క్యాపిట ల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు రైతు ఉత్పత్తులకు విలువ జోడిరచి అత్యధిక ఆదాయం పొందే మార్గాలపై వివరించారు. స్వయం సహాయక సంఘాల సభ్యు లు, రైతు ఉత్పత్తి సంస్థల సభ్యుల ఆలోచనలకు అనుగుణంగా వారి ఉత్పత్తులకు అధిక విలువ జోడిరచి అధిక ఆదాయం పొందేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా సంస్థల ప్రతిపాదనలపైనా చర్చించారు. త్వరలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)తో ఆయా కంపెనీలు ఎంవోయూలు చేసేందుకు నిర్ణ యించారు. మహిళలు ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు అధిక ఆదాయం పొందేందుకు అవసర మైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ సమావేశంలో సెర్ఫ్ సీఈ వో కరుణ, డైరెక్టర్ పద్మావతి, ఐఐఎం బెంగళూరు ప్రొఫెసర్ త్రిలోచనాశాస్త్రి, మిల్లెట్ బ్యాంక్ సీఈవో విశాల, క్యాపిటల్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సీఈవో రజిని, డైరెక్టర్ హెచ్ ఎస్ విశ్వనాథ్, ఫ్లిప్‌కార్ట్ ప్రాజెక్ట్ హెడ్ దీపూజ్యోషి తదితరులు పాల్గొన్నారు.