- భూ కేటాయింపులు, మౌలిక వసతులపై సమీక్ష
- ప్లాంట్ల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తాం
- తద్వారా 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
- బంజర భూముల్లో రైతులకు అదనపు ఆదాయం
- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో మరిన్ని పెట్టుబడులు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయబోయే 500 కంప్రెస్ట్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు. సీబీజీ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి రిలయన్స్ ప్రతినిధులు, ఇంధన శాఖ అధికారులతో సచివాలయంలో మంగళవారం మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు. సీబీజీ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి రూ.65,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి రిలయన్స్ సంస్థ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో ప్లాంట్ల నిర్మాణం ప్రారంభానికి అవసరమైన సంస్థాగత చర్యలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో తొలి దశలో ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో బంజర భూముల్లో సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని మంత్రి రిలయన్స్ ప్రతినిధులకు సూచించారు. ఈ క్రమంలో ప్రకాశం, పల్నాడు జిల్లాల కలెక్టర్లతో భూ కేటాయింపుల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయానికి అనుకూలంగా లేని బంజర భూములను గుర్తించాలని కోరారు. ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూ రుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రిలయన్స్ ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు కావాల్సిన భూ అనుమతులకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో కూడా చర్చించినట్లు చెప్పారు. క్లీన్ ఎనర్జీ దిశగా ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలపడానికి సంబంధించి రిలయ న్స్ సంస్థకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా వ్యాపార అనుకూలమైన ఇండస్ట్రియల్ పాలసీని తీసు కొచ్చామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్లాంట్ల నిర్మా ణం వెంటనే ప్రారంభించాలని, దానికి అవసరమైన భూ కేటాయింపులు, మౌలిక వస తులతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.
ప్లాంటుతో 2.5 లక్షల మందికి ఉపాధి
సీబీజీ ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రంలోని 2.5 లక్షల నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని వివరించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా అన్ని అనుమతులు వేగంగా మంజూరు చేయడం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా నిలపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులతో రిలయన్స్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పునరు త్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని వివరిం చారు. పారిశ్రామిక అనుకూల పాలసీలతో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వివిధ ప్రాజెక్ట్‌లను ఏపీలో ఏర్పాటు చేయడానికి వస్తున్నాయని వెల్లడిరచారు. పున రుత్పాదక విద్యుత్ రంగంలో దేశంలోనే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యాపార అనుకూల సంస్కరణ లను అమలు చేస్తున్న నేపథ్యంలో రిలయన్స్ సంస్థ ఏపీలో ఏర్పాటు చేసే సీబీజీ ప్లాం ట్ల నిర్మాణ ప్రక్రియను సాధ్యమైనంత వేగవంతం చేయాలని ఆ సంస్థ ప్రతినిధులకు మరోసారి సూచించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ప్రతినిధులతో పాటు ఇంధన శాఖ అధికారులు పాల్గొన్నారు.