- ఐదేళ్లలో వ్యవస్థలను సర్వ నాశనం చేశాడు
- ప్రతిపక్ష హోదా కోసం నేడు నినాదాలు సిగ్గుచేటు
- ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వారికి బుద్ధి చెబుదాం
- కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించుకుందాం
- గనులు, భూగర్బవనరులు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర
- విద్యావంతుల గొంతు వినిపిద్దాం: మంత్రి వాసంశెట్టి
పామర్రు(చైతన్యరథం): శాసనమండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించుకుని రాష్ట్రాన్ని అధ్వానంగా మార్చిన వారికి గుణపాఠం చెబుదామని గనులు, భూగర్భ వన రులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. పామర్రు నియోజకవర్గం తొట్లవ ల్లూరు మండల పార్టీ కార్యాలయం, అవనిగడ్డ చల్లపల్లి వివేకానంద డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి పాల్గొన్నారు. విభజన జరిగిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చేసిన ప్రయత్నాలను జగన్ రెడ్డి నాశనం చేశాడని ధ్వజమెత్తారు. నదుల అనుసంధానంతో నీటిని కాపాడుకునేందుకు కట్టిన పట్టిసీమను దండగ అన్నారు. నాటి చంద్రబాబు చొరవతోనే నేడు కృష్ణా డెల్టా పచ్చగా ఉంది. పోలవరం, అమరావతి సహా అన్ని రకాల పనులను నిలిపివేసి అభివృద్ధికి విఘాతంగా మారాడని మండిపడ్డారు. బూత్‌ల వారీగా ఓటర్లను గుర్తించి ప్రతి ఓటు కూడా కూటమి అభ్యర్థికి నమోదు అయ్యే లా చూడాలని సూచించారు. చివరి ఓటు పోలయ్యే వరకు కూడా ఏజెంట్లు అందుబా టులో ఉండాలని చెప్పారు. విద్య, ఉద్యోగాల కోసం బయటకు వెళ్లిన వారిని స్వగ్రామా లకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు పంటను మిల్లుకు తర లించిన 24 గంటల్లోనే డబ్బులు జమచేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. కాలువలు, డ్రైన్ల పనులు ఇప్పటికే పూర్తి చేశాం. ఏప్రిల్లోనే పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకు న్నాం.
నీటి సంఘాలు ఏర్పాటు చేసుకుని రైతాంగానికి తోడుగా నిలుస్తున్నామని చెప్పా రు. కేసులు విచారిస్తున్న అధికారుల బట్టలు ఊడదీస్తానని జగన్ బెదిరించడం సిగ్గుచే టు. ప్రజలు గుడ్డలూడదీస్తే ప్రతిపక్ష హోదా కావాలంటూ అరిచి గగ్గోలు పెడుతున్నావ్. గవర్నర్ చదువుతున్నప్పుడు.. ప్రతిపక్ష హోదా కావాలంటూ బాయ్‌కాట్ చేయడం సిగ్గుచేటు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీలో వచ్చి అడగడానికి సిగ్గుండా లని హితవుపలికారు. జగన్‌రెడ్డి హయాంలో అసెంబ్లీలో బూతులు మాట్లాడే వారు.. బియ్యం దొంగలు, మట్టి మాఫియా లీడర్లను మండలికి పంపి జిల్లా ప్రతిష్టను దెబ్బతీశా రని మండిపడ్డారు. కానీ నేడు జిల్లాను, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. కృష్ణా డెల్టాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిం చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉంది. నదులన్నింటినీ అనుసంధానించేలా ప్రణాళిక రచిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లేశాం.త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి సంక్షేమ పథకాలను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.
విద్యావంతుల గొంతు మండలిలో వినిపిద్దాం
మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యా వంతుడైన ఆలపాటి రాజాను గెలిపించి పట్టభద్రుల గొంతును మండలిలో వినిపిద్దామని పిలుపునిచ్చారు. ఆలపాటి రాజాను ఏ విధంగా గెలిపించాలి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహా లు రచించాలి పట్టభద్రులను ఏ విధంగా కలవాలి వంటి విషయాలపై అవగాహన కల్పిం చారు. అలాగే పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి మండలిలో తన గొంతు ప్రభుత్వానికి వినిపించాలంటే రాజా గెలుపు ఎంతో అవశ్యమన్నారు. ఆయ నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.