- బడ్జెట్ సమావేశాల సమయంలో సెలవులు రద్దు
- ముఖ్యమంత్రి ఆదేశాలు పాటించడం తప్పనిసరి
- మంత్రులకు ముందుగానే సమాచారం ఇవ్వాలి
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
అమరావతి(చైతన్యరథం): బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ లో సంబంధిత శాఖల కార్యదర్శులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగు తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారని వాటిని కార్యదర్శులు అందరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సచివాలయం సీఎస్ సమావేశ మందిరం నుంచి సోమవారం ఆయన అన్ని శాఖల కార్యదర్శులు, ప్రిన్సిపల్ కార్యదర్శు లు, స్పెషల్ సీఎస్‌లతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల నిర్వహ ణకు సంబంధించి పలు ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సం బంధించి సమగ్ర సమాచారాన్ని ముందుగానే మంత్రులకు అందజేయాలన్నారు.
అంశా ల వారీగా గత ప్రభుత్వంలో తీసుకున్న చర్యలు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తీసుకుం టున్న చర్యలను స్పష్టంగా తెలిపే సమగ్ర సమాచారాన్ని ముందుగానే ఇవ్వాలని సూచిం చారు. ఇందుకు సంబంధించి శాఖల వారీగా ఉన్న నోడల్ అధికారులను అప్రమత్తం చేయాలని కోరారు. సమావేశాలు నిర్వహించే సమయంలోనే స్టార్, అన్ స్టార్ ప్రశ్నలకు సవివరమైన సమాధానాలు మంత్రులు ఇచ్చే విధంగా వారికి తగిన సమాచారాన్ని ఆయా శాఖల కార్యదర్శులు ముందురోజే అందజేయాలన్నారు. సమావేశాల సమయంలో ఆర్జిత సెలవులు, విదేశీ పర్యటన సెలవులు ఎవరికీ మంజూరు చేయవద్దని ముఖ్యమంత్రి స్పష్ట మైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అన్ని శాఖల కార్యదర్శలు, ప్రిన్సిపల్ కార్యదర్శులు, స్పెషల్ సీఎస్‌లు వర్చ్యువల్‌గా పాల్గొన్నారు.