- రూ.12 లక్షలు వసూలు చేసి మోసం
- విజయనగరం జిలా బాధితుల ఫిర్యాదు
- ఆట స్థలం కబ్జా చేసి వైసీపీ నేతల నిర్మాణాలు
- స్కూల్ విద్యాకమిటీ సభ్యుల ఫిర్యాదు
- అర్జీలు స్వీకరించిన నెట్టెం రఘురాం, దేవెంద్రప్ప
మంగళగిరి(చైతన్యరథం): వైసీపీ గ్రామ సర్పంచ్ గత ప్రభుత్వంలో పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి సుమారు రూ.12 లక్షలు వసూలు చేసి మోసగించాడని విజయనగరం జిల్లా గంట్యాల మండలం నరవ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివా రం ప్రజావినతుల కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి పేదల డబ్బులు తిరిగి వెనక్కి ఇచ్చేలా చూడాలని అభ్యర్థించారు. మాజీ మంత్రి నెట్టెం రఘురాం, కురబ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్పలకు అర్జీలు స్వీకరించారు.
` తన ఇంట్లో పనిచేస్తున్న రాజేష్ అనే వ్యక్తి తాను పని మీద బయటకు వెళ్లడంతో ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదు తీసుకెళ్లాడని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన ఎల్.జ్యోతీశ్వరి తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వివరించింది. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తమ్ముడి ఇంట్లో రాజేష్ అమ్మ పనిచేస్తుండటంతో కేసు పట్టించుకోవడంలేదని..ఈ దొంగతనంపై విచారించి తమ ఇంట్లో పోయిన డబ్బులు బంగారాన్ని ఇప్పించాలని కోరింది.
` వైసీపీ గ్రామ సర్పంచ్ గత ప్రభుత్వంలో పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి సుమారు రూ.12 లక్షలు వసూలు చేశాడని విజయనగరం జిల్లా గంట్యాల మండలం నరవ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి పేదల డబ్బులు తిరిగి వెనక్కి ఇచ్చేలా చూడాలని అభ్యర్థించారు.
` ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం కోటాలపల్లి గ్రామంలో ప్రభుత్వ స్కూల్ ఆట స్థలాన్ని వైసీపీ పార్టీ లీడర్లు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టగా కోర్టుకు వెళితే ఆ నిర్మాణాలను నిలిపిందని స్కూల్ విద్యా కమిటీ సభ్యులు తెలిపారు. ఈ అక్రమ నిర్మాణా లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
` కర్నూలు జిల్లా ఆదోని 21వ వార్డు సచివాలయంలో కంప్యూటర్లు పనిచేయక పోవడంతో ఏ పనిమీద వెళ్లినా సచివాలయ సిబ్బంది ఆ సాకుతో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని బోయ శకుంతల ఫిర్యాదు చేసింది.
` తమ చేత ఆస్తి రాయించుకుని కుమారులు తమను ఇంటి నుంచి రోడ్డుపైకి గెంటారని అనంతపురం జిల్లా రాప్తాడు మండలం జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన చాకలి రామాంజనేయులు దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. దయచేసి తాము తమ ఇంట్లో ఉండేలా సాయం చేయాలని వృద్ధ దంపతులు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
` తమ ఇంటి పక్కనున్న వారు భూమిని ఆక్రమించి ఇబ్బంది పెడుతున్నారని పశ్చి మగోదావరి జిల్లా కాళ్ల మండలానికి చెందిన విజయలక్ష్మి ఫిర్యాదు చేసింది. అధికారులు సర్వే చేసి తమ భూమి కబ్జా నుంచి విడిపించాలని వినతిపత్రం అందజేసింది.
` తమ స్వాధీనంలో ఉన్న భూమిని గత ప్రభుత్వంలో ఎటువంటి హక్కులు లేని వారికి మ్యూటేషన్ చేసి ఆన్‌లైన్ చేశారని కర్నూలు జిల్లా హలహర్వి మండలం విరుపా పురం గ్రామానికి చెందిన విశ్వనాథ్ ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచారించి తమ భూమి తమ పేరుపైస ఉండేలా చూడాలని విన్నవించారు.
` తన ఇంటిపై నుంచి వెళుతున్న సర్వీస్ విద్యుత్ వైర్లను తొలగించి పక్కకు మార్చాలని పల్నాడు జిల్లా అమరావతి మండలం మండేపూడి గ్రామానికి చెందిన కోట నాగభూషణం వినతిపత్రం అందజేశారు. లేదంటే తమకు ఆ వైర్ల నుంచి ప్రమాదం ఉందని విన్నవించారు.