అమరావతి (చైతన్యరథం): ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరచిపోని ప్రజా నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు అని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆదివారం మంత్రి లోకేష్ నివాళులు అర్పించారు. ప్రజా సమస్యలపై ఎర్రన్నాయుడు స్పందించే విధానం, అనేక క్లిష్టమైన సమస్యలపై ఆయన పోరాటం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. రాష్ట్రానికి, తనని నమ్ముకున్న ప్రజలకి న్యాయం చెయ్యాలనే బలమైన సంకల్పం ఉంటే భాష అసలు సమస్యే కాదని రుజువు చేసి ఢల్లీి రాజకీయాల్లో ఎర్రన్న చెరగని ముద్ర వేసారని మంత్రి లోకేష్ ప్రశంసించారు.