చిరకాల ప్రతర్థి పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం పట్ల విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. అభిమానుల హర్షధ్వానాలతో హోరెత్తుతున్న దుబాయ్ స్టేడియంలో కుమారుడు దేవాన్ష్‌తో కలిసి టీమిండియా విజయాన్ని ప్రత్యక్షంగా వీక్షించటం మరపురాని అనుభవం అన్నారు. మ్యాచ్‌పై సంపూర్ణ ఆధిపత్యం, అద్భుతమైన టీమ్‌వర్క్‌తో భారత్ గెలుపొందిందన్నారు. విరాట్ కోహ్లి మళ్లీ టాప్ ఫామ్‌లోకి రావటం శుభపరిణామం అన్నారు. టీమిండియా ఆటగాళ్ల ప్రతిభ గర్వకారణమని ఎక్స్‌లో లోకేష్ పేర్కొన్నారు.