- ఏడాదిపాటు విద్యుత్ భారాలు ఉండవన్న ఏపీఈఆర్సీ
- డిస్కంల రాబడి వ్యయాల మధ్య అంతరం రూ.12632 కోట్లు
- జగన్ పాపాలను భరించడానికి సిద్ధపడిన చంద్రబాబు సర్కారు
- భరించాల్సిన నష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం…
- బాబును మళ్లీ రప్పించింది అందుకేనంటూ జనంలో ఆనందం
అమరావతి (చైతన్య రథం):
విద్యుత్ ఛార్జీల పెంపు లేదంటూ ఏపీఈఆర్సీ చేసిన తాజా ప్రకటన `గత ప్రభుత్వ విధ్వంస పాలకుడి ముఖాన ఈడ్చి గుద్దినట్టేవుంది. విద్యుత్ భారాలను తగ్గిస్తానన్న పబ్లిక్ ప్రమాణాలతో అధికారంలోకి వచ్చి.. గద్దెనెక్కిన మరుక్షణం నుంచే రాష్ట్ర ప్రజలను రాచి రంపాన పెట్టిన చరిత్ర జగన్‌ది. ఐదేళ్ల పాలనా కాలంలో తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడమే కాకుండా.. అస్మదీయులకు దోచిపెట్టిన మొత్తాలను వ్యవస్థ నష్టాలుగా చూపించి.. ప్రజలపై పెనుభారం మోపిన నిస్సిగ్గుల జగన్‌కు `కూటమి ప్రభుత్వం ఇస్తోన్న అతి పెద్ద కౌంటర్.. విద్యుత్ భారాలు మోపడం లేదన్న ప్రకటన. మూడు డిస్కమ్‌ల ద్వారా రాబడి అంచనా.. రూ.44,323 కోట్లు కాగా, వ్యయ అంచనా రూ.57,544 కోట్లుందని, రాబడి వ్యయాల మధ్య అంతరం రూ.12,632 కోట్లను భరించడానికి ప్రభుత్వం అంగీకరించడం వల్లే ప్రజలపై విద్యుత్ భారాలు లేవన్నది ఏపీఈఆర్సీ చేసిన ప్రకటన సారాంశం. ప్రజలు ఎంత విలవిల్లాడుతున్నారన్న స్పృహలేకుండా.. అదేపనిగా విద్యుత్ భారాలు మోపుతూ వచ్చిన విధ్వంసకారుడికి `చంద్రబాబు సర్కారు ఇచ్చిన స్రోక్ ఇదే. ఏదేమైనా.. రాష్ట్ర ప్రజలకు ఏపీఈఆర్సీ చల్లని దొరువులాంటి మాట చెప్పింది.
`ముఖ్యమంత్రి చంద్రబాబు చలవతో!!
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు లేదంటూ ఈఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్‌సింగ్ గురువారం ప్రకటించారు. తాజాగా 2025-26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల టారిఫ్‌ను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ విడుదల చేశారు. ఏ విభాగంలోనూ విద్యుత్ ఛార్జీలు పెంచడంలేదని స్పష్టం చేశారు. టారిఫ్‌లు విడుదల చేయడానికి మార్చి 31 వరకూ సమయమున్నా.. ఫిబ్రవరిలోనే విడుదల చేస్తున్నట్టు వెల్లడిరచారు. మూడు డిస్కమ్‌ల ద్వారా రాబడి అంచనా.. రూ.44,323 కోట్లు కాగా, వ్యయ అంచనా రూ.57,544 కోట్లుగా ఛైర్మన్ పేర్కొన్నారు. రాబడి వ్యయాల మధ్య అంతరం రూ.12,632 కోట్లుగా ఉందని వెల్లడిస్తూ.. ఆ అంతరాన్ని భరించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఠాకూర్ వెల్లడిరచారు. నిజానికి టారిఫ్‌ల పెంపు లేదని ఏపీఈఆర్సీ చేసిన ప్రకటన శంఖంలో పోసిన తీర్ధమంతే. గడచిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి విజయం సాధించి.. చంద్రబాబు నాయుడు గద్దెనెక్కినపుడే `ఐదేళ్లపాటు జగన్ విధించిన ‘పవర్ ఎమర్జెన్సీ భారం’నుంచి విముక్తి లభించినట్టేనని రాష్ట్ర ప్రజలు భావించారు. ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ.. డిస్కంల ఆదాయ అవసరాలు (ఎఆర్‌ఆర్), ప్రతిపాదిత టారిఫ్‌ల దాఖలు (ఎఫ్‌పీటీ)పై గత జనవరిలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసిన సందర్భంలోనే ఏపీఈఆర్సీ ఈ విషయాన్ని వెల్లడిరచింది. డిస్కంల ఆర్థికలోటును భరించడానికి ప్రభుత్వం ముందుకొచ్చిన నేపథ్యంలో ఏదాది వరకు చార్జీల పెంపు ఉండదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్ రాకూర్ రాంసింగ్ అప్పుడే స్పష్టం చేశారు. ఆమేరకే.. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి రిటైల్ సప్లై టారిఫ్ ఆర్డర్‌ను ఏపీఈఆర్సీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
జగన్ ఇచ్చిన షాకులకు ఇక చెక్!
జగన్ అసమర్థ, స్వార్థపూరిత విధానాల అమలు ఫలితంగా ఐదేళ్లపాటు రాష్ట్ర ప్రజలు షాకులమీద షాకులు తింటూనే వచ్చారు. జగన్ పాపాల ఫలితం ఐదేళ్లపాటు ప్రజలను వెంటాడిరది. అస్మదీయులకు లబ్ది చేకూర్చేలా జగన్ సాగించిన విధ్వంస పాలనతూ విద్యుత్ రంగం నిర్వీర్యమవ్వడమే కాదు, రాష్ట్ర ప్రజలు భరించలేని యాతన అనుభవించారు. గత ప్రభుత్వ పాలనా సమయంలో చివరి రెండేళ్లలో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసిన ఫలితం ఎఫ్‌పీపీసీఏ పేరిట రూ.15,485 కోట్ల భారం ఏపీఈఆర్సీకి డిస్కంలు అందజేసిన గణాంకాలే ఇందుకు సాక్ష్యం.
జగన్ అధికారం చేపట్టిన తొలినాళ్లలో పాలనానుభవ లేమితో వేసిన ‘తప్పటడుగు’.. విద్యుత్ సంస్థల రుణభారానికి కారణమైంది. ప్రజలపై ఏటా ఇంధన సర్దుబాటు ఛార్జీల భారం (ఎఫ్పీపీసీఏ) విధిస్తూనే వచ్చారు. జగన్ ఐదేళ్ల దద్దమ్మ పాలనలో ప్రజలకు జరిగిన కీడు ఎంతో.. అతని అస్మదీయ సంస్థలకు జరిగిన మేలు అంతకు పదిరెట్లు. ఆస్మదీయుల బాగుకోసమే మనసుపెట్టి పనిచేసిన జగన్.. విద్యుత్ రంగం భ్రష్టుపట్టడానికి కారణమయ్యాడన్నది నిపుణులు చెప్పే మాట. నిబంధనలను కాలరాసి, వాస్తవాలను వక్రీకరించి.. అస్మదీయుల సంస్థలనుంచి అధిక ధరకు విద్యుత్ కొనడం జగన్ చేసిన మొదటి పాపమైతే.. రాజకీయ కక్ష సాధింపులతో అంతకుముందున్న పీపీఏలను రద్దు చేయడం మరో పాపం. ఫలితంగా చివరి రెండేళ్లలో రూ.15,485 కోట్ల ఎఫ్‌పీపీసీఏ భారం ప్రజలపై పడిరదన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి అందజేసిన నివేదికల్లో డిస్కంలు ప్రస్తావించిన గణాంకాలే అందుకు రుజువు.
సీవోఎస్ పెరగడానికి కారణాలివీ..
2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై సమీక్ష పేరిట ప్రభుత్వం పెద్ద హడావుడి చేసింది. ఉత్పత్తి సంస్థలనుంచి తీసుకోవాల్సిన విద్యుత్‌కు బదులుగా మార్కెట్‌నుంచి కొనుగోలు చేసింది. దీంతో ఇబ్బంది పడిన ఉత్పత్తి సంస్థలు న్యాయపోరాటం సాగించాయి. తీసుకోని విద్యుత్‌కు కూడా పీపీఏ ధర ప్రకారం బిల్లులు చెల్లించాలని కోర్టు డిస్కంలను ఆదేశించింది. జగన్ సర్కారు చేతకాని విధానాల ఫలితంగా.. ఆయా సంస్థలకు 2023-24లో రూ.9,500 కోట్లు వడ్డీతో కలిపి డిస్కంలు చెల్లించక తప్పలేదు. హిందుజా సంస్థ నుంచీ విద్యుత్ తీసుకోకపోయినప్పటికీ.. రూ.1,234 కోట్లు సొంత జేబునుంచి ఇచ్చినట్లుగా జగన్ సర్కారు చెల్లించేసింది. అదే సమయంలో అస్మదీయ సంస్థలకు ఆర్థిక ప్రయోజనం కలిగించేలా మెటీరియల్‌ను అధిక ధరకు అడ్డగోలుగా కొన్నారు. అనవసరమైనచోట్ల సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టారు. అవసరంలేని చోట్ల విద్యుత్ టవర్ల నిర్మాణాన్ని సాగించారు. బహిరంగ మార్కెట్లో రూ.75వేలకు ఒక ట్రాన్స్‌ఫార్మర్ లభించిన సందర్భంలో.. రూ.2.25 లక్షలకు అంచనాల ప్రతిపాదనలతో కొనుగోళ్లు సాగించారు. నిజానికి `కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి డిస్కంల స్టోర్స్‌ల్లో సుమారు రూ.3 వేల కోట్ల ఉపకరణాలు పడిఉన్నాయంటే.. జగన్ జమానాలో సాగించిన విద్యుత్ దందా ఏతీరున ఉందో అంచనా వేసుకోవచ్చు. చిత్రమేంటంటే `నిరుపయోగంగా పడివున్న ఉపకరణాల్లో ‘షిరిడిసాయి ఎలక్ట్రికల్స్’ నుంచి కొనుగోలు చేసినవే ఎక్కువ ఉండటం గమనార్హం. ఆస్మదీయ సంస్థలకు జగన్ సర్కారు ఏస్థాయిలో దోచిపెట్టిందో అంచనా వేసుకోవచ్చు.
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పాడని, వైఎస్సార్ జిల్లాలో అవసరం లేకున్నా ఒక్కోటి రూ.2.5 కోట్ల ఖర్చుతో 68 కొత్త సబ్జెస్టేషన్లు నిర్మించారు. ఇదేతీరులో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరిస్థాయిలో వారు ఒత్తిడితెచ్చి వందల సంఖ్యలో సబ్ స్టేషన్లను మంజూరు చేయించుకున్న దుర్మార్గం జగన్ జమానాలోనే సాగింది.
కొన్నది తక్కువ.. ధర ఎక్కువ
ఏటా డిస్కంలు ఏపీఈఆర్సీకి దాఖలుచేసే వార్షికాదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)లో.. రాష్ట్రంలో ఏడాదికి ఎంత విద్యుత్ అవసరం? మార్కెట్ నుంచి ఎంతకొనాలి? అనే వివరాలను ప్రస్తావిస్తాయి. జగన్ జమానాలోని చివరి రెండేళ్లలో డిస్కంలు విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ అనుమతించిన దానికంటే రూ.19,884 కోట్లు అదనంగా ఖర్చు చేశాయి. ఈ రెండేళ్లకు సంబంధించిన ఎఫ్‌పీపీసీఏ ప్రతిపాదనలను విద్యుత్ చట్టం ప్రకారం గత ప్రభుత్వ హయాంలోనే డిస్కంలు ఏపీఈఆర్సీకి సమర్పించాయి. కానీ, ఎన్నికల దృష్ట్యా వసూలుకు ఉత్తర్వులు ఇవ్వకుండా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీఈఆర్సీ అనుమతిచ్చింది. తాను చేసిన పాపాన్ని కూటమికి అంటగట్టి.. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే విద్యుత్ ఛార్జీల భారాన్ని నెత్తినమోపి ప్రజల నడ్డి విరిచారంటూ వైసీపీ యాగీ చేయడం.. దౌర్భాగ్య దిగజారుడు రాజకీయానికి పరాకాష్ట.
యూనిట్ విద్యుత్ సరఫరాకు
(కాస్ట్ ఆఫ్ సర్వీస్- సీవోఎస్) ఖర్చు
సంవత్సరం యూనిట్ ధర(రూ.లో)
2020-21 7.41
2021-22 7.20
2022-23 8.04
2023-24 8.27
విద్యుత్ కొనుగోలు, నిర్వహణ, సరఫరా, పంపిణీ నష్టాలు, ఇతర ఖర్చులు కలిపి ఒక యూనిట్ విద్యుత్‌ను వినియోగదారుడికి అందించడానికి ఎంత ఖర్చవుతుందో డిస్కంలు ఏటా లెక్కలు తేలుస్తాయి. గత నాలుగేళ్లలో సీవోఎస్ యూనిట్‌కు 86 పైసలు పెరగ్గా, అధిక ధరకు కొనడమే ఇందుకు కారణమని నిర్ధారించాయి.
గత రెండేళ్లలో ఏపీఈఆర్సీ అనుమతించిన, వాస్తవ విద్యుత్ కొనుగోలు వివరాలు (ఎంయూల్లో)
ఆర్థిక సంవత్సరం ఏపీఈఆర్సీ అనుమతి వాస్తవ కొనుగోలు వ్యత్యాసం
2022-23 72,928 72,075 (-)853
2023-24 75,220 79,758 4,538
గత రెండేళ్లలో డిస్కంలు విద్యుత్ కొనుగోలుకు చేసిన ఖర్చు (రూ.కోట్లలో)
ఆర్థిక సంవత్సరం ఏపీఈఆర్సీ అనుమతి వాస్తవ ఖర్చు అదనపు ఖర్చు
2022-23 35,173 42,887 7,714
2023-24 37,297 49.467 12,170
2022-23లో స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా 8,394 ఎంయూలను రూ.6,522 కోట్లతో డిస్కంలు కొన్నాయి.. యూనిట్‌కు సగటును రూ.7.77 చొప్పున ఉత్పత్తి సంస్థలకు చెల్లించాయి.
2023-24లో 11,655 ఎంయూలను రూ.8,871 కోట్లతో (యూనిట్‌కు సగటున రూ.7.61 చొప్పున) కొనుగోలు చేశాయి.