- గుంటూరు యార్డులో అవినీతిపై జవాబు చెప్పు
- నీ డ్రామాలు చూసి రైతులు నవ్వుకుంటున్నారు
- కనీస మద్దతు ధరను తగ్గించి మోసగించలేదా?
- మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు
మంగళగిరి(చైతన్యరథం): మిర్చి రైతులను నట్టేట ముంచిన రైతు ద్రోహి జగన్ రెడ్డి అని గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ధ్వజమెత్తారు. గురు వారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలనలో మిర్చి యార్డులోని జరిగిన అవినీతి, అక్ర మాలు, అరాచకాల మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. దాదాపు రూ.2000 కోట్లకు పైగా అవినీతి జరిగింది.. వాటికి సంబంధించిన పూర్తి వివ రాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాం. స్పందించిన ఆయన విజిలెన్స్ విచార ణకు ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్ ప్రాథమిక విచారణలో భాగంగా రూ.350 కోట్ల అవినీతి జరిగినట్లు కూడా అధారాలు సేకరించారు. ఈ రూ.350 కోట్లు మాత్ర మే కాదు.. ఇంకా రూ.1500 కోట్ల అవినీతి వెలుగు చూడాల్సి ఉందని చెప్పారు. మిర్చి యార్డులో ప్రతి ఏటా రూ.20,000 కోట్ల వ్యాపారం లావాదేవీలు జరుగుతాయి. దానికి గాను 1 శాతం సెస్సు వ్యాపారులు చెల్లించాల్సి ఉంది. దాని ద్వారా ఏడాదికి రూ.200 కోట్లు అంటే ఐదేళ్లలో రూ.1000 కోట్లు రావాలి.. జీఎస్టీ ద్వారా మరో రూ.2000 కోట్లు రావాలి.. ఇందులో సగం మాత్రమే మిర్చి యార్డులో జమ అయింది.
మిగతా మొత్తం కూడా అక్కడ ఉన్న వైసీపీ నాయకులు, అధికారులు స్వాహా చేశారు. అదేకాకుండా 400 లైసెన్సులు రెన్యూవల్ చేస్తే ఒక్కో దానికి రూ.50,000 నుంచి లక్ష వరకు వసూలు చేశారు. 160 లైసెన్సులను ఒక పేరు నుంచి మరో పేరుకు బదిలీ చేసేందుకు ఒక్కో లైసెన్స్ నుంచి రూ.10 లక్షలు వసూ లు చేశారు. వైసీపీ సానుభూతిపరులు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో.. వారు రూ. 200 కోట్ల నుంచి రూ.300 కోట్లు వరకు ఎగనామం పెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువా త వారిపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. వాస్తవానికి 2019-20, 2020-21, 2021-22లో ధరలు ఎంత ఉన్నాయి.. ఇప్పటి ధరలు ఎంత ఉన్నాయో తెలుసుకోండి. రూ.20 వేలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్వింటా రూ.7000 కనీస మద్దతు ధరగా నిర్ధారించి మిర్చి యార్డులో బోర్డు కూడా పెట్టించారు. మరి ఆయన అంటున్న రూ.20,000 కేవలం ఒక్క ఏడాది మాత్రమే కొనుగోలు జరిగాయని అర్థమా? ఈ విధంగా జగన్‌రెడ్డి మిర్చి యార్డులో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ముందు అక్కడ జరిగిన అవినీతి మీద మాట్లాడాల్సిన బాధ్యత ఆయనపై మీద ఉంది. ఎందుకంటే ఆ పార్టీకి చెందిన నాయకులే ప్రధానం గా ఈ అవినీతిలో పాలు పంచుకున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు బోనస్ ఇచ్చి ఆదుకున్నారు
2017లో నేను చైర్మన్‌గా ఉన్నప్పుడు రూ. 6000 నుంచి రూ.8000 ధర పలుకుతున్నప్పుడు.. ఈ ధర చాలదు.. మనం మద్దతు ధర ప్రకటించాలి.. రైతాం గానికి బోనస్ ఇవ్వాలని చెప్పి అప్పటి సీఎం చంద్రబాబు రూ.129 కోట్లు విడుదల చేసి.. దాదాపుగా 56000 మంది రైతులను అదుకున్నారు. సుమారు 87 వేల మెట్రి క్ టన్నుల మిర్చిని అ రోజు కొనుగోలు చేశాం. అంటే ఒక్కోక్క రైతుకు రూ.30,000 లబ్ధి చేకూరే విధంగా చంద్రబాబు కృషి చేశారు.. జగన్ రెడ్డి తన ఐదేళ్ల కాలంలో ఏ పంటకు అయిన బోనస్ ప్రకటించావా..? నీకు అసలు ఎంఎస్‌పీనే ఎంత ప్రకటిం చాలో కూడా నీకు కనీస అవగాహన లేదు.. అంతేకాకుండా ఏ పంటపైనా నీకు అవగాహన లేదు. మిర్చి యార్డుకు వచ్చి ఉక్కిరిబిక్కిరి అయ్యావ్.. ఇంకా అరగంట అలస్యం అయితే నువ్వు రైతులను పరామర్శించడం కాదు.. రైతులు నిన్ను పరామ ర్శించే స్థాయికి పరిస్థితి వచ్చేదని వ్యాఖ్యానించారు.
రాజకీయ లబ్ధికోసమే అబద్ధాలు
ఏ పంట ఎలా పండిరది.. ఏ పంట ఎక్కడ పండుతుంది.. ఎంత ఖర్చు అవు తుంది.. ఎంత పెట్టుబడి పెట్టాలి.. కనీస అవగాహన లేదు నీకు.. అలాంటి మిర్చి యార్డులోకి వచ్చి రైతులను పరామర్శ పేరుతో వచ్చి రైతులపై దండయాత్ర చేసినట్లు ఉంది.. రైతులను వైసీపీ గుండాలు, అక్కడికి వచ్చినటువంటి కిరాయి గుండాలు, రౌడీలు, చుట్టుపక్కలు ఉన్న సంఘ విద్రోహ శక్తులు అన్ని కూడా అక్కడికి చేరుకుని రైతులపై దాడులు చేశారు.. రైతుల మిర్చి టిక్కిలు ఎత్తుకువెళ్లారు. అక్కడ ఉన్న రైతులకు ఏ మాత్రం సహాయ పడకపోగా.. అక్కడికి వచ్చి.. అక్కడ ఉన్న వ్యాపార లావాదేవీలు, అమ్మకాలు, అక్కడకు వస్తున్న సరుకును అంతా కూడా నానా హం గా మా చేశారు. రాజకీయ లబ్ధి కోసం, సీఎం చంద్రబాబు మీద, ప్రభుత్వం మీద బురద జల్లేందుకు వచ్చినట్లు ఉంది తప్పితే రైతులకు ఏ మాత్రం మేలు చేసేందుకు వచ్చిన ట్లు అయితే లేదు.. నిజంగా రైతులకు మేలు చేయలంటే అసెంబ్లీ వేదికగా ఉంది.. వచ్చే 24 నుంచి శాసనసభ సమావేశాలు మొదలు అవుతున్నాయి. అక్కడికి వెళ్లి రైతు సమస్యలపైన, ప్రజా సమస్యలపైన నీ వాణి వినిపించు.. నువ్వు అక్కడ గట్టిగా నిలబడు.. మాట్లాడు.. అక్కడ మాట్లాడకుండా పులివెందుల ప్రజలు ఎమ్మెల్యే అసెంబ్లీ కి పంపిస్తే.. అసెంబ్లీలో మాట్లాడు.. నువ్వు మిర్చి యార్డుకు వచ్చి మాట్లాడితే కేవలం రాజకీయ లబ్ధి కోసమే కానీ, ఏ మాత్రం కూడా రైతాంగానికి మేలు చేద్దామని ఆలో చనే లేదు.. గత ఐదేళ్ల పాలనలో ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. 2019-2022 మధ్య కాలంలో ధరలు పూర్తిగా పడిపోయాయి. అ రోజు మీరు మిర్చి యార్డును సందర్శించారా? కనీసం ఒక్క మాట అయిన మాట్లాడావా? అలాంటిది ఇప్పుడు మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది? ఈ విధంగా అవినీతిపరులను, దొంగలను, దోపిడీదారులను ప్రోత్సహస్తూ వారిని రైతుల మీద పంపి దోచుకుంటూ ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు.