- ప్రజావినతుల కార్యక్రమంలో యువకుల ఫిర్యాదు
- చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి భూకబ్జాపైనా బాధితుల వినతి
- ట్రాన్స్‌ఫార్మర్ వేసేందుకు ఏఈ కనకరాజు లంచం
- ప్రశ్నిస్తే వైసీపీ నేతలతో పొలాలకు కరెంట్ కట్
- అర్జీలు స్వీకరించిన మంత్రి సబిత, సుజయకృష్ణ
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భూ కబ్జాలు, ఇతర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. బాధితు ల నుంచి అర్జీదారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితమ్మ, మాజీ మంత్రి, ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుజయకృష్ణ రంగారావు వినతులు స్వీకరించారు. భూ సమస్యలపై సంబంధించిన అధికారులతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కా రానికి కృషి చేశారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు చెందిన యువకులు తమ సమస్యను వివరిస్తూ కొచ్చెర్ల ధర్మారెడ్డి అనే వ్యక్తి చెందిన రెడ్డెం ఇటలీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 350 మంది దగ్గర సుమారు రూ.7 కోట్లు వసూలు చేసి మోసం చేశారని ఫిర్యాదు చేశారు. ధర్మారెడ్డిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
` మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధికారులతో కుమ్మక్కై 22ఏలో ఉన్న భూమి ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని తిరుపతి రూరల్ మండలం దామినేడు గ్రామానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి చెవిరెడ్డి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
` వ్యవసాయ పంపుసెట్లకు ట్రాన్స్‌ఫార్మర్ వేసేందుకు రైతుల దగ్గర లంచం తీసు కున్న ఏఈ డెక్కా కనకరాజును ప్రశ్నించినందుకు వైసీపీ నాయకుల ప్రోద్బలంతో మా పొలాలకు కరెంట్ లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అనకాపల్లి జిల్లా మునగ పాక మండలం మెలుపాక గ్రామానికి చెందిన యెల్లేడి వీర వెంకట సత్య మాధవ రావు ఫిర్యాదు చేశారు. ఏఈ కనకరాజుపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
` గత టీడీపీ హయాంలో ఇచ్చిన టిడ్కో ఇంటికి మున్సిపల్ అధికారులు, బ్యాంక్ అధికారులు లోన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, అడవి తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన రమణబాయి (72) ఆవేదన వ్యక్తం చేసింది. వయసు అయిపోయింది..లోన్ ఇవ్వడం కుదరదని మొత్తం రూ.3 లక్షలు ఒకేసారి కట్టకుంటే సామగ్రి బయట వేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు.
` తన భర్త (అప్పారావు లేట్)కు రావాల్సిన ఆస్తిని తన మరిది, అత్త కలిసి తనకు రాకుండా అడ్డుపడుతున్నారని పల్నాడు జిల్లా దాచేపల్లి గ్రామానికి చెందిన పప్పుల అనుషా ఫిర్యాదు చేసింది. దీని వల్ల పిల్లల చదివించడం కష్టంగా మారిందని తెలిపారు. ఆస్తిలో తన భర్తకు రావాల్సిన వాటాను తనకు వచ్చే విధంగా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
` తన పొలాన్ని రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడు గ్రామానికి చెంది న దొడ్డా బుల్లోడు ఫిర్యాదు చేశారు. సంబంధింత అధికారులతో మాట్లాడి తన పొలం ఆన్‌లైన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.
` తన భార్య పేరు మీద ఉన్న 5 ఎకరాలను వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన చల్లార సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. కబ్జా నుంచి తన భూమిని విడిపించాలని కోరారు.
` గన్నవరం గ్రామానికి చెందిన రెడ్డెం పద్మ తన భూమిని కబ్జా చేసి వేరే వ్యక్తులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం కంకణంపాడు గ్రామానికి చెందిన కుంచా నాగేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. వారిపై చర్యలు తీసుకొని తన పొలం తనకు వచ్చే విధంగా న్యాయం చేయాలని కోరారు.
` కేవలం కమ్మ సామాజికవర్గానికి చెందిన వారమని పింఛన్ తీసుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నా పింఛన్ రాకుండా కొంతమంది వైసీపీ నేతలు అడ్డుకున్నారని పల్లాడు జిల్లా కారంపూడి మండలం నరమాలపాడు గ్రామానికి చెందిన దివ్యాంగు రాలు గుదె ఇందుశ్రీ ఆవేదన వ్యక్తం చేసింది. దివ్యాంగురాలినైన తనకు పింఛన్ ఇప్పించాలని కోరారు.
` 2014-19లో స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో భాగంగా ఇంటి నుంచి చెత్త సేకరణ చేయడానికి ఉద్యోగం ఇవ్వగా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ కార్యకర్త అన్న కారణంతో ఉద్యోగం నుంచి తొలగించారని అనకాపల్లి జిల్లా మునగపాడు మండలం యలమంచిలి గ్రామానికి చెందిన గుంట్ల రణమ ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పించాలని వినతిపత్రం ఇచ్చారు.