- రాజ్యాంగ వ్యతిరేక పాలన సాగించింది మీరు కాదా?
- చంద్రబాబుది ప్రజాపాలన..రాజ్యాంగబద్ధ పాలన
- అందువల్లే జగన్ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు
- అరాచకవాదికి జైలులో పరామర్శ ప్రజాస్వామ్యమా?
- ఇకపై అతిక్రమిస్తే చట్టం పాదాల కింద నలగక తప్పదు
- మీ తప్పుడు పనులకు పోలీసులు సెక్యూరిటీ ఇస్తారా?
- వారిని ఇష్టమొచ్చినట్లు బెదిరిస్తూ మాట్లాడటం సరికాదు
- జగన్‌రెడ్డికి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కౌంటర్
మంగళగిరి(చైతన్యరథం): చంద్రబాబుది ప్రజాస్వామ్య పాలన.. జగన్‌ది అప్రజా స్వామ్య పాలన అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. టీడీపీ కేం ద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా పరిపాలన సాగుతుంది కాబట్టే చంద్రబాబు దయతో జగన్‌రెడ్డి రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.. అయినా వైసీపీ నేతలు బుర్ర లేకుండా మాట్లాడుతున్నారు..తప్పు చేయడానికి వెళుతూ సెక్యూరిటీ అడగటం ఏంటని మండిపడ్డారు. సెక్యూరిటీ లేదంటూ జగన్ ఆయన తాబే దారులు అంబటి, బొత్సలు మాట్లాడుతున్నారంటే గడిచిన ఐదేళ్లు సీఎంగా పనిచేసింది జగనేనా అనే అనుమానం కలుగుతోందన్నారు. మాజీ ముఖ్యమంత్రికి జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను అడగటంతోనే వారి బుర్రల్లో గుజ్జు లేదని అర్థమైందన్నారు. గడిచిన ఐదేళ్లు అరాచకం, అప్రజాస్వామికం, రాక్షస పాలనను నడిపి ప్రజలను హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు స్వేచ్ఛగా బయటతిరగడమే కాకుండా ఆ స్వేచ్ఛకు భంగం కలిగి స్తున్నారని తెలిపారు. నాడు చంద్రబాబు విశాఖ వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసి ఆయన ఇంటి గేట్లకు తాడు కట్టిన అప్రజాస్వామిక పాలన జగన్‌రెడ్డి కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబును తిరుపతి ఎయిర్‌పోర్టులో నేలమీద కూర్చోబెట్టిన దుష్ట పాలన వైసీపీ కాదా అని నిలదీశారు. జగన్ పాలన అంతా రాజ్యాంగ వ్యతిరేకమేనని ధ్వజమెత్తారు. నేడు అటువంటి దుష్టపాలన లేదని, ప్రజాపాలన నడుస్తోందని తెలిపారు. రాజ్యంగబద్ధమైన పాలన జరుగుతుంటే సహించలేకపోతున్నారని మండిపడ్డారు.
మహిళలను అవమాన పరిచి దళితులు, రైతులను అగౌరవ పరిచిన వ్యక్తి అరెస్టు అయితే 144 సెక్షన్ ఉన్నా మాజీ ముఖ్యమంత్రిగా వేలాది మందిని తీసుకెళ్లి పరామర్శించడం దేనికి సంకేతం.. దుర్మార్గాన్ని వెనకేసుకురావడం కాదా? మిర్చి మార్కెట్ యార్డు ఎవరి చేతిలో ఉంది.. వైసీపీ నేతల చేతిలో కాదా? అయినా జగన్‌రెడ్డి మిర్చి యార్డుకు వెళ్లింది ఎందుకు? మిర్చి బస్తాలను దొంగతనం చేయించడానికా? పోయిన మిర్చి బస్తాలకు ఎవరు బాధ్యు లు? ఒక దళిత డాక్టర్ సుధాకర్ చనిపోయినప్పుడు ఎందుకని వెళ్లి పరామర్శించలేదు? జగన్‌రెడ్డి తన నియోజకవర్గంలో ఒక దళిత మహిళపై అత్యాచారం చేసి హతమార్చిస్తే ఎందుకు పరామర్శించడానికి వెళ్లలేదు? దుర్మార్గులు, సంఘ విద్రోహక శక్తులను అరెస్ట్ చేస్తే మాత్రం వెళ్లి పరామర్శిస్తారా? మళ్లీ సెక్యూరిటీ ఇవ్వలేదంటూ మాట్లాడటం సిగ్గని పించడం లేదా? తప్పులు వైసీపీ నేతలు చేస్తూ పోలీసు అధికారుల బట్టలు ఊడదీస్తానం టూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరైనది కాదు.. ఇకపై పరిధి దాటి మాట్లాడినా, చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని యత్నించినా చట్టం ఇనుప పాదాల కింద వైసీపీ నేతలు నలిగిపోక తప్పదని హెచ్చరించారు.