అమరావతి (చైతన్య రథం) ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు కోరారు. ఈమేరకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆయన లేఖ రాశారు. మార్కెట్ జోక్యం ద్వారా తగ్గిన ధరను భర్తీ చేసేలా చూడాలని కోరారు. సాగు వ్యయానికి, విక్రయధరకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలని కోరారు. 50 శాతం నిష్పత్తిలో కాకుండా వందశాతం నష్టాన్ని కేంద్రం భరించాలని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులను ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. గడిచిన 10 ఏళ్లుగా మిర్చి ఉత్పత్తి, ధరలపై వివరాలను సీఎం సమర్పించారు.