గుంటూరు (చైతన్య రథం): మాజీ సీఎం జగన్ సహా మరో 8మంది వైకాపా నేతలపై గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా గుంటూరు మిర్చి యార్డులో వైకాపా నేతలు కార్యక్రమం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పర్యటించిన జగన్‌తోపాటు ఆ పార్టీ నేతలు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్, పిన్నెల్లి తదితరులపై పోలీసులు కేసు నమోదు. జగన్ పర్యటన కారణంగా మిర్చియార్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై వైకాపా నేతలు, కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వాహనాలను నిలిపివేయడంతో రైతులు అవస్థలు పడ్డారు. మిర్చియార్డులోకి సరకు తెచ్చే వాహనాలతోపాటు పంటలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మిర్చిలోడు లారీలు, వ్యాన్లు రోడ్డుపైనే నిలిచిపోయాయి.