- త్వరలో అందుబాటులోకి స్విమ్స్ ఆసుపత్రి రెఫరల్స్
- ఖాళీగా ఉన్న నర్సింగ్, పారా మెడికల్ పోస్టుల భర్తీ
- కార్మిక, బీమా వైద్యసేవల మంత్రి వాసంశెట్టి సుభాష్
- తిరుపతి శాఖ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీలు
తిరుపతి(చైతన్యరథం): రాష్టంలో కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించేందు కు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు కార్మిక, ఫ్యాక్టరీలు, బీమా వైద్యసేవల మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఆయన బుధవారం మధ్యాహ్నం తిరుపతి కార్మిక రాజ్య బీమా (ఈఎస్‌ఐ) ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి లోని అవుట్ పేషెంట్ బ్లాక్, అత్యవసర విభాగం, ఓపీ రిజిస్ట్రేషన్ విభాగం, ఇతర విభా గాలను తనిఖీ చేశారు. గత సంవత్సరం నవంబర్‌లో ఆసుపత్రి సందర్శనకు వచ్చినప్పు డు ఉన్న అవుట్ పేషెంట్స్ నమోదు సంఖ్య 150 నుంచి ప్రస్తుతం 350 వరకు పెరగ డం, ఇన్ పేషెంట్స్ అడ్మిషన్స్ సంఖ్య 30 నుంచి 53 వరకు పెరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పేషెంట్స్‌కు ఐదేళ్లుగా సక్రమంగా లేని ల్యాబ్ కిట్స్, రీ ఏజెంట్స్, ఇతర పరికరాలను సుమారు రూ.5 లక్షల తన సొంత ఖర్చుతో సమకూర్చడం, ఇతర సేవలు సమకూరడంపై ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.శ్యాంబాబును అభినందిస్తూ సన్మానించారు. రాష్ట్రంలోని ఇతర ఆసుపత్రులు, డిస్పెన్సరీలు తిరుపతి ఆసుపత్రిని ఆద ర్శంగా తీసుకుని కార్మికులకు మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఆరేళ్లకు పైగా రాయలసీమ, నెల్లూరు లాంటి జిల్లాల ఈఎస్‌ఐ కార్మికులకు అందని ద్రాక్షగా ఉన్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి సెకండరీ, టెరిషరీ రెఫరల్ వైద్యసేవలు మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఇందుకు ప్రత్యేక కృషి చేసిన రాష్ట్ర బీమా వైద్యశాఖ డైరెక్టర్ వి.ఆంజినేయులు, ఈఎస్‌ఐ విజయవాడ రీజినల్ డైరెక్టర్, తిరుపతి ప్రాంతీయ అధికారులకు అభినందనలు తెలిపారు. అలాగే ఈఎస్‌ఐ ఆసుపత్రులలో కార్మి కులకు మెరుగైన ల్యాబ్ సర్వీస్‌లు, ఇన్ పేషెంట్స్ సేవలు అందించేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర బీమా వైద్యశాఖలో గత 15 ఏళ్లుగా భర్తీకి నోచు కోని నర్సింగ్, పారా మెడికల్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఈఎస్‌ఐలో ఎటువంటి అలసత్వాన్ని సహించమని, అలాగే కష్టపడి సంస్థ అభివృద్ధి చేసే వారిని మరిచేది లేదని ఇంకా మెరుగైన వైద్యసేవలు అందించడానికి నా వైపు నుంచి అన్ని తొందరలో సమకూర్చి మళ్లీ కలుస్తానని చెప్పారు. మంత్రి వెంట ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఎం.శ్యాంబాబు, సీఎస్‌ఆర్‌ఎంవో ఎ.వి.ఎస్.ప్రసాద్ ఉన్నారు.