- దళితుడిపై దాడి నిందితుడికి పరామర్శలా?
- పార్టీ కార్యాలయాలపై దాడి చరిత్రలో ఎక్కడా లేదు
- ఆ సంస్కృతికి మొదటిసారి తెరలేపింది జగన్‌రెడ్డే
- తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు
- గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు
మంగళగిరి(చైతన్యరథం): గన్నవరం టీడీపీ కార్యాలయంలో దళితులు, యువకులు, మహిళలపై దాడి చేసి పార్టీ కార్యాలయం, అక్కడ ఉన్న కార్లు తగలబెట్టి పలువురిని గాయపరిచిన వ్యక్తికి వత్తాసు పలకడానికి జగన్‌రెడ్డికి సిగ్గుగా లేదా అని గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. దేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ కార్యాలయాలపైనా దాడి చేసిన ఘటనలు ఎక్కడా లేవు. అలాంటి నీచ చరిత్రకు తెరలేపడమే కాకుండా దాడిపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేసిన వారిని వెనకేసుకు రావడం దుర్మార్గమని మండిపడ్డారు. పార్టీ కార్యాలయాలపై దాడి చేసిన సంస్కృతికి తెరలేపింది జగన్‌రెడ్డేనని విమర్శించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యాలయంపై దాడిపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసిన కేసులో అరెస్టయి జైలులో ఉన్న వంశీని సిగ్గులేకుండా పరామర్శకు వెళ్లారు. పరామర్శ తర్వాత తప్పడు మాటలు మాట్లా డుతున్నారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం వంటి ఘటనలు ఇదివరకు ఎప్పు డూ జరగలేదు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాకే ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నా యని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న కృష్టా జిల్లాలో పులివెందుల ఫ్యాక్షనిజాన్ని తీసుకు రావడానికి జగన్‌రెడ్డి, వారి గూండాలు ప్రయత్నించారు. ఎంతోమంది మేధావులు పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. స్వర్గీయ ఎన్టీఆర్, త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, కాశీ నాధుని మల్లికార్జునరావు, చండ్రా రాజేశ్వరావు, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మేధావు లు పుట్టిన కృష్టా జిల్లాను రౌడీమూకలతో దాడి చేయించి జిల్లా ప్రతిష్టను దిగజార్చే విధం గా చేసిన నీచుడు జగన్‌రెడ్డి. జగన్ లాంటి అరాచక వ్యక్తుల అండ చూసుకునే వల్లభనేని వంశీ వంటి వారు అరాచకాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పోలవరం గట్ల మీద మట్టి కొట్టేశారు..బ్రహ్మలింగం చెరువు మట్టి కొట్టేశారు..అక్రమంగా దాడులు చేసి భయబ్రాం తులకు గురిచేశారు.
ఇనుపరాడ్లు పట్టుకుని రోడ్లపైన తిరుగుతూ మహిళలపై దాడులు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక దళిత వ్యక్తి సత్యవర్థన్ ఫిర్యాదు చేస్తే కిడ్నాప్ చేసి దాడి చేసి అతనిని బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించి కేసును వాపస్ తీసుకునేలా చేసింది వల్లభనేని వంశీ కాదా? అని ప్రశ్నించారు. ఈరోజు సాక్ష్యాలతో సహా బట్టబయలైతే పోలీసులను బెదిరిస్తున్నారు. నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్న అధికారులను అసభ్యపదజాలంతో దూషిస్తున్నారు. ఇదేనా జగన్‌రెడ్డి నీ సంస్కా రం? ఒక నిందితుడిని కలవడానికి జైలుకు వచ్చి విచారణాధికారులను దూషించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేశారు. రాజకీయ చైతన్యం, మేధావులు పుట్టిన గడ్డపైకి దుర్మార్గులు చేరి నాశనం చేశారు. ఇలాంటి నేరస్తులకు జగ న్‌రెడ్డి వత్తాసు పలుకుతున్నారు. ఇలాంటి అరాచకాలు మరోసారి పునరావృత్తం కాకుం డా చూస్తామని తెలిపారు. క్యాసినోలు, కబ్జాలు, భూములు కొట్టేయడం, దాడులు లాంటి మరెన్నో ఘటనలు బయటకు వస్తున్నాయి. అధికారం ఉంది కదా అని కృష్టా జిల్లాలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చట్టం నుంచి ఎవరూ తప్పించు కోలేరని హెచ్చరించారు. పవి త్రమైన పార్టీ కార్యాలయాలపైన దాడులు చేయించారు.. తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. కేసు పెట్టిన దళిత యువకుడిని దుర్మార్గంగా కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టిన కేసులో ఉన్న ప్రతిఒక్కరిపై ప్రజాస్వామ్యబద్దంగా చర్యలు తీసుకుంటాం..ఇలాంటి ఘటనలు మరోసారి రాష్ట్రంలో జరగకుండా చర్యలుంటాయని హెచ్చరించారు.