అమరావతి(చైతన్యరథం): జగన్ దళిత వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నా రని మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ వ్యాఖ్యానించారు. అనంతబాబును సత్కరించి దళితు డైన సుబ్రమణ్యం హత్యను సమర్థించారు. ఆయన కుటుంబాన్ని పట్టించుకోకుండా గాలి కొదిలేశారు. గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపినా జగన్ నిమ్మకు నీరెత్తినట్లు గా వ్యవహరించాడు. ఆయన రాజకీయ క్రీడకు దళితుడైన కోడికత్తి శ్రీనును బలిచేశా రు. బాధితులను పరామర్శించడానికి రాని జగన్ నేరస్తులను మాత్రం పరామర్శిస్తూ అండగా నిలిచారు. కిడ్నాప్‌నకు గురైన దళితుడైన సత్యవర్దన్‌ను పరామర్శించటానికి జగన్‌కు మనసు లేదు. ఆయన బూర్జువా మనస్తత్వం దళితులకు శాపమైందని విమర్శిం చారు. జగన్ పాలనలో వరప్రసాద్ శిరోముండనం ప్రజలు ఇంకా మరచిపోలేదు. డాక్ట ర్ సుధాకర్‌ని వేధించి చంపినా ఆయన కుటుంబాన్ని పరామర్శించలేదు. దళితులంటే చిన్నచూపు, కక్ష ఎందుకు? దళితులకు చేసిన అన్యాయాలకు జగన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.