- ఆలయాలపై చర్చ, వర్క్ షాప్
అమరావతి (చైతన్య రథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం తిరుపతికి వెళ్లనున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో నిర్వహిస్తోన్న టెంపుల్ ఎక్స్‌పో ప్రారంభ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. 17నుంచి 19 వరకూ మూడు రోజులపాటు తిరుపతిలో టెంపుల్ ఎక్స్‌పో జరగనుండటం తెలిసిందే. కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి మహారాష్ట్ర సీపం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్.. ముగ్గురూ సదస్సును ప్రారంభిస్తారు. ఎక్స్‌పోలో భాగంగా నిపుణులమధ్య ఆలయాలపై చర్చలు, వర్క్ షాపులు నిర్వహంచనున్నారు.