- లక్ష్య సాధనలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
- పరిశుభ్రతతోనే ప్రజలకు ఆరోగ్యం, మెరుగైన సమాజం
- గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేస్తే…మేము సంపద సృష్టిస్తున్నాం
- 8 నెలల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం
- ఆడబిడ్డల జోలికొస్తే.. వాళ్లకిక మూడినట్టే..
- నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా
- కందుకూరును ప్రకాశంలో విలీనానికి ఆమోదయోగ్యమైన నిర్ణయం
- వెలుగొండను పూర్తిచేసి కందుకూరుకు జలాలను అందిస్తా
- ‘స్వర్ణాంధ్ర `స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
నెల్లూరు (చైతన్య రథం): ఏపీని స్వచ్ఛాంధ్రగా మార్చాలని సంకల్పించినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. ‘స్వచ్ఛమైన ఆలోచనలతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రజలంతా నెలలో ఒక్కరోజైనా సమయం కేటాయించాలి’ అని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంటలో స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. తొలుత నెల్లూరు జిల్లా కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ సీఎం ప్రసంగించారు. ‘‘పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. అక్టోబరు 2నాటికి చెత్త తొలగించే బాధ్యతను మున్సిపల్ శాఖకు అప్పగించాం. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒకరోజు కేటాయించాలి. ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదు. చెత్తను పునర్వినియోగం చేసి.. సంపద సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా 64 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నాం. ఇబ్బందుల్లో ఉన్నవారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. నేరస్థులపట్ల కఠినంగా ఉంటాం. వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాం. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టం’’ అని చంద్రబాబు హెచ్చరించారు.
మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. దూబగుంటలో గ్రామస్థులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, అక్కడే గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. చెత్తనుంచి సంపద సృష్టించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో సర్పంచే ప్రథమ పౌరుడని అంటూ.. పంచాయతీ నిధులతో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి ఊరినీ ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత సర్పంచ్‌లదేనన్నారు.అన్ని గ్రామాలకు ర్యాంకులు ఇస్తామని, బాగా పనిచేసే సర్పంచులను సత్కరిస్తామన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలని సీపం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు.
కందుకూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. కందుకూరు మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నాం. దశాబ్దాలుగా పెండిరగ్‌లోవున్న కందుకూరు సమీపంలోని నాలుగు గ్రామాల గర్భ కండ్రిక భూముల సమస్యకు పరిష్కారం చూపుతాం. కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపేందుకు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటాం. వెలుగొండను పూర్తిచేసి కందుకూరుకు నీళ్లిస్తాం. నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు.
‘మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. నేరస్తులపట్ల కఠినంగా ఉంటాం. నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాం. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టం. గంజాయి ఉత్పత్తి చేస్తే ఉపేక్షించం. పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. అక్టోబర్ 2నాటికి చెత్త తొలగించే బాధ్యతను మున్సిపల్‌శాఖకు అప్పగించాం. చెత్తను పునర్వినియోగం చేసేందుకు కృషి చేస్తున్నాం. చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంపునకు యత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు చేసిందని, గత ప్రభుత్వం చేసిన అప్పునకు అసలు, వడ్డీలు కట్టాల్సి ఉందన్నారు. అప్పులు చెల్లించాలని కొందరు ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారని సీఎం వివరించారు. ‘మా ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే అభివృద్ధిని పరుగులు పెట్టించాం. సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలనే సంకల్పం ఉన్నా.. ఖజానా ఖాళీగా ఉంది. ప్రతినెలా పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 64 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నాం. ఏడాదికి రూ.33 వేల కోట్లు పింఛన్ల రూపంలో ఇస్తున్నాం. ఇబ్బందుల్లోవున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రజల్లో ఉత్సాహం చూస్తే నాకు ఎక్కడా లేని ధైర్యం వస్తుంది. ప్రజలకు సేవలు అందించడమే నా లక్ష్యం అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఐదేళ్లపాటు రోడ్ల మీద తట్టెడు మట్టి కూడా వేయలేని అసమర్థ పాలన వైసీపీ సాగించిందని దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి రాగానే రోడ్ల మీద గుంతలన్నీ పూడ్చాం. పెన్షన్లకు ఇప్పటికే రూ.22 వేల కోట్లు ఖర్చు చేశాం. దీపం కింద ఉచింత సిలిండర్ ఇచ్చాం. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. మెసేజ్ పెడితే చాలు సర్టిఫికెట్ అందుతుంది. ప్రజలు ఆఫీసులకు తిరిగే పని లేకుండా సులభతరం చేశాం. ఎన్టీఆర్ హయాంలో మండల వ్యవస్థలు తీసుకొచ్చారు. మా హయాంలో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చాం. ఇప్పుడు సెల్‌ఫోన్ ద్వారానే సేవలు పొందేలా చేశాం. ఇంటి మీదనే విద్యుదుత్పత్తి చేసుకునే పరిస్థితులు వచ్చాయి. పీఎం సూర్యఘర్ కింద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నాం. వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాం. కష్టపడి పనిచేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయడం నేర్చుకోవాలి. పేదరికం లేని సమాజం నా కల. దేవుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత సేవ చేస్తానని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. తద్వారా యువతకు ఉద్యోగాలు కల్పిస్తాము. స్కిల్ డెవలప్‌మెంటు సెంటర్ల ద్వారా యువతలో వృత్తి న్కెపుణ్యాలు మెరుగుపరుస్తాం. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం. నెల్లూరులో రూ. 330 కోట్లతో 620 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించే 10 మెగావాట్ల వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను, రాజమండ్రిలో 340 కోట్లతో 640 మెట్రిక్ టన్నుల చెత్త తొలగించే 12 మెగావాట్ల వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతున్నాము. రూ. 60 కోట్లతో ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నాము. 300 గ్రామాలను ఓడిఎఫ్ ప్లస్ గా త్వరలో డిక్లేర్ చేస్తాం. రాష్ట్రంలో 29 శాతం ఉన్న గ్రీన్ కవర్ ను 50 శాతానికి పెంచేందుకు కృషి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
దూబగుంట గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలను, స్వచ్చాంధ్ర లక్ష్యం దిశగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో సీఎం మాట్లాడారు. ఈ సంరద్భంగా కందుకూరులో స్కిల్ డెవలప్‌మెంటు సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కోరారు.