అమరావతి (చైతన్య రథం): అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి ఘటనను సీఎం చంద్రబాబు ఖండిరచారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత యువతి, ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో గణేశ్ అనే యువకుడు ఓ యువతి తలపై కత్తితో గాయపరిచి ముఖంపై యాసిడ్ పోశాడు. గాయాలపాలైన బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. నిందితుడు మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందినవాడిగా గుర్తించారు.