- చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ సంఘం వినతి
- ప్రజావినతుల కార్యక్రమంలో సమస్యలపై అర్జీలు
- అర్జీలు స్వీకరించిన వర్ల రామయ్య, బొల్లినేని
మంగళగిరి(చైతన్యరథం): నాల్గో తరగతి ఉద్యోగుల కో-ఆపరేటివ్ హౌసింగ్ బిల్డిం గ్ సొసైటీ లిమిటెడ్‌కు చెందిన 300 కోట్ల విలువైన స్థలాలను అక్రమంగా విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర సంక్షేమ సంఘం సమితి సభ్యులు కోరా రు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఆ మేరకు వినతిపత్రం అందజేశారు. ఆ స్థలాలను అర్హులకు కేటాయించాలని కోరారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అర్జీలు స్వీకరించారు.
` తాను చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి తన భార్య చెల్లెలు తన ఇంటిని ఆక్రమించుకుని తమపై దౌర్జన్యం చేస్తుందని నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలా నికి చెందిన పి.వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచారించి ఇంటిని కబ్జా నుంచి విడిపించాలని వినతిపత్రం అందజేశారు.
` ప్రభుత్వ భూ సేకరణలో భూమిని తీసుకుందని.. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా తన తమ్ముళ్లు ఇబ్బంది పెడుతున్నారని కడప జిల్లా మైదుకూరు మండ లం బ్రాహ్మణవీధికి చెందిన పి.రామారావు తెలిపారు. తనను చంపేస్తామని గన్ పెట్టి బెదిరిస్తున్నారని.. తనకు రావాల్సిన వాటాను తనకు ఇప్పించేలా చూడాలని వేడుకున్నాడు.
` మాజీ సైనికులకు జీవనోపాధిలో భాగంగా ప్రభుత్వం తనకు స్థలం కేటా యించిందని.. దానికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చే లోపు మరో వ్యక్తి తనకు కేటాయించిన భూమిని ఆక్రమించుకున్నాడని చిత్తూరు జిల్లా పూతలప ట్టు చింతమాకులపల్లికి చెందిన వి.రాకేష్ ఫిర్యాదు చేశారు. అతని నుంచి భూమి విడిపించి తనకు కేటాయించాలని అభ్యర్థించాడు.
` తాము గత 20 సంవత్సరాల నుంచి విజయవాడలో అద్దె ఇంట్లో ఉంటు న్నామని..తమకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన మర్రి అంభిక వేడుకున్నారు.
` తమ భూములను ప్రభుత్వం భూసేకరణ కింద తీసుకొని నేటికీ పరిహారం ఇవ్వలేదని నెల్లూరు జిల్లా కలిగిరికి చెందిన గిరిజమ్మ, షేక్ ఖాజా రహంతుల్లా, షేక్ ఫరీదా, సీహెచ్ శివరామయ్య తెలిపారు. దీనిపై కోర్టుకు వెళ్లగా వెంటనే తమకు పరిహారం ఇవ్వాలని ఆదేశించినా అధికారులు పట్టించుకోవడంలేదని.. రావాల్సిన పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
` తమకు వారసత్వంగా వచ్చిన భూమిని ఆన్‌లైన్‌లో తమ పేర్లను తొలగించి వేరొకరి పేర్లను ఎక్కించారని నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం మంచాలపల్లి గ్రామానికి చెందిన రాజాల తిరుపాలు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచా రించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.