- ఎయిర్‌పోర్ట్ అథారిటీ నుంచి నిధులు
- సీఎస్‌ఆర్ కింద ఫండ్‌కు సమ్మతి
- శ్రీకాకుళం జిలా, కుప్పంకు మేలు
- మంత్రి అచ్చెన్నతో సంస్థ ప్రతినిధుల భేటీ
- హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి నిధులు తీసుకుని రావడంలో కేంద్ర, రాష్ట్ర మంత్రుల కృషి, సమన్వయం ఫలించాయి. కేంద్ర పౌరవిమాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమష్టి కృషి ఫలి తంగా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రాష్ట్రానికి నిధులు ఇచ్చేందుకు సమ్మతించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్‌ఆర్) కింద నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ పరిణామం సానుకూల ఫలితాలకు సంకేతంగా నిలుస్తుందని, జిల్లా అభివృద్ధికి దోహదం అవుతుందని సంబంధిత వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నా యి. ఈ నిధులతో పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, యూఎన్‌డీఎస్ కన్సల్టెన్సీ ప్రతి నిధులు, యునైటెడ్ నేషన్స్ డెవలెప్‌మెంట్ అథారిటీ ప్రతినిధులు కింజరాపు అచ్చెన్నా యుడుతో విజయవాడలో భేటీ అయి ఇందుకు సంబంధించిన చర్చలు జరిపారు.
అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాతో పాటే కుప్పం నియోజకవర్గానికీ రూ.10 కోట్ల నిధులు అందను న్నాయి. ఇప్పటికే సీఎస్‌ఆర్ కింద ఇటీవల కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు చొరవతో రూ.50 లక్షల విలువ చేసే కృత్రిమ పరికరాలను దివ్యాంగులకు అందించే కార్యక్ర మానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. ఇదే క్రమంలో సీఎస్‌ఆర్ ఫండ్‌ను మరింతగా ఈ ప్రాంత ప్రజలకు వినియోగపడే విధంగా కేంద్ర మంత్రి అలానే రాష్ట్రమంత్రి చొరవ చూపి తీసుకుని రావడంతో జిల్లా ప్రగతి మరింత పురోగమించనుంది. ప్రధానంగా నీటివనరుల అభివృద్ధి, సామాజిక అభివృద్ధి పనులు, వైద్యసదుపాయాల సౌకర్యం, మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన పనులకు ఈ నిధులు వెచ్చించనున్నారు. నిధుల మంజూరుపై జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు.