చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఆర్థిక వృద్ధితో స్వర్ణాంధ్రకు బాటలు

మంత్రులు, కార్యదర్శుల సమీక్షలో చంద్రబాబు

by చైతన్యరధం
Feb 12, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఆర్థిక వృద్ధితో స్వర్ణాంధ్రకు బాటలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 15 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ప్రణాళిక
  • నైపుణ్యాభివృద్ధికి ఐగోట్‌ కర్మయోగి సాధనం
  • పారిశ్రామికాభివృద్ధితో ఉద్యోగావకాశాలు
  • ఇబ్బందులున్నా ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు
  • మంత్రులు, కార్యదర్శుల సమీక్షలో చంద్రబాబు

అమరావతి(చైతన్యరథం): వికసిత్‌ భారత్‌కు అనుగుణంగా స్వర్ణ ఆంధ్ర 2047 విజన్‌ ప్రణాళిక రూపొందించాం.. దీనిలో భాగంగా రాష్ట్రం సంవత్సరానికి 15 శాతం కంటే ఎక్కువ వృద్ధితో తలసరి ఆదాయం పెరుగుదలతో 2.4 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో మంగ ళవారం మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో జీఎస్‌డీపీపై సమీక్షలో సీఎం మాట్లాడా రు. విభజన అనంతరం 2014-15 నుంచి 2018-19 వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు తలసరి ఆదాయంలో సమానంగా పోటీ పడ్డాయని వివరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ 13.21 శాతం వృద్ధిని నమోదు చేయగా, తెలంగాణ 13. 37 శాతం వృద్ధిని సాధిం చిందని తెలిపారు. కేవలం స్వల్ప తేడా మాత్రమే ఉండేదన్నారు. జాతీయ సగటు 9.75 శాతంతో పోలిస్తే రెండు రాష్ట్రాలు మెరుగైన స్థానంలో ఉన్నాయని చెబుతూ 2019 -20 నుంచి 2023-24 మధ్య రెండు రాష్ట్రాల మధ్య భారీ తేడా వచ్చిందని తెలిపారు. జాతీయ సగటు 8.16 శాతానికి తగ్గినా తెలంగాణ కొంతవరకు నిలబడిరదన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ మాత్రం గణనీయంగా వెనుకబడినట్లు చెప్పారు.

తెలంగాణ తలసరి ఆదాయం 13.21 శాతం నుంచి 11.45 శాతానికి తగ్గి రూ.3,56,564కి చేరింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ 13.21 శాతం నుంచి 9.18 శాతానికి తగ్గి రూ.2,37,951కి పడి పోయిందన్నారు. ఈ రెండు రాష్ట్రాల తలసరి ఆదాయంలో రూ.1,18,613 వ్య త్యాసం ఏర్పడిరది. 2014-15లో 13.07 శాతంగా ఉన్న ఏపీ జీఎస్‌డీపీ వృద్ధి రేటు 2023-24కు 8.60 శాతానికి తగ్గిందని తెలిపారు. అయితే 2024-25 మొదటి ముం దస్తు అంచనా 12.90 శాతంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో వికసిత్‌ భారత్‌కు అను గుణంగా స్వర్ణ ఆంధ్ర 2047 విజన్‌ ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. దీనిలో భాగంగా రాష్ట్రం సంవత్సరానికి 15 శాతం కంటే ఎక్కువ వృద్ధితో రూ.42,000 తలసరి ఆదాయంతో 2.4 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరిం చారు. సంవత్సరానికి వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 15 శాతానికి రెట్టింపు అయితే జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం 4.4 రెట్లు కంటే ఎక్కువ పెరుగుతాయని అంచనా వేశా రు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-07-2025

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయకుండా ప్రజలపై భారం వేస్తే వృద్ధిరేటు కుం టుబడుతుందని, ఆర్థిక వ్యవస్థను రెట్టింపు చేయడానికి మానసికంగా సిద్ధపడాలని, దాని ద్వారా ప్రజలకు సంపదను పంచవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. దీనికోసం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో విజన్‌ మానిటరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తారు. జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ఐదేళ్ల ప్రణాళికలు రూపొందించబడతా యని, జిల్లా అధికారులకు శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నట్లు చెప్పారు. వేగ వంతమైన, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించే ప్రాజెక్టులను జిల్లాస్థాయిలో గుర్తిస్తారని వివరించారు. మండల, జిల్లా, నియోజకవర్గ, రాష్ట్రస్థాయిలో లక్ష్యాల పర్యవేక్షణకు ప్రత్యే క పోర్టల్‌ అభివృద్ధి చేస్తారని తెలిపారు. విజన్‌ అమలును వేగవంతం చేయడానికి సిబ్బందిని డిప్యూటేషన్‌ పద్ధతిలో నియమించాలని ప్రతిపాదించారు.

స్వర్ణాంధ్ర 2047 విజన్‌ వార్షిక వృద్ధి 15 శాతం లక్ష్యంలో భాగంగా 2025-26కి జీఎస్‌డీపీ వృద్ధి లక్ష్యం 16 శాతంగా నిర్ణయించబడిరది. వ్యవసాయం, అనుబంధ రంగాలలో ఉత్పాదకత, వ్యవసాయ వాణిజ్యీకరణ, పారిశ్రామిక విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవా రంగంలో ఉత్పాదకత, నాలెడ్జ్‌ ఎకానమీ, టెక్నాలజీ, కృత్రిమ మేధ వినియోగం, పరి పాలన, ఆర్థిక సంస్కరణలలో నిరంతర ప్రయత్నాలు, పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలు జీఎస్‌డీపీ అభివృద్ధికి దోహదపడతాయన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాల్లో 2024-25లో రూ. 5,19,485 కోట్లు (15.86% వృద్ధి రేటు) కాగా 2025-26 లక్ష్యం రూ.6,02,728 కోట్లు (16.02% వృద్ధి రేటు), పరిశ్రమల రంగంలో రూ.3,41,331 కోట్లు (6.71%) నుంచి రూ.3,99,358 కోట్లు (17%) లక్ష్యంగా పెట్టుకోగా సేవల రంగంలో రూ.6,11,390 కోట్లు (11.70%) నుంచి రూ. 7,10,714 కోట్లు (16.25%) లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

స్వర్ణాంధ్ర సాధనలో ఐగోట్‌ కర్మయోగి సాధనం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాభివృద్ధికి ఐ గోట్‌ కర్మయోగి పోర్టల్‌ స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా నైపుణ్యాభివృద్ధికి, మానవ వనరుల అభివృద్ధికి ఇది ఒక వ్యూహాత్మక సాధనంగా ఉపయోగపడుతుంది. ఇటీవల, కెపాసిటీ బిల్డింగ్‌ కమి షన్‌ (జదీజ), ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని వివిధ శాఖల నుంచి సుమారు 8.2 లక్షల మంది ఉద్యోగులు ఇప్పటికే ఐగోట్‌ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఐగోట్‌ కర్మయోగి అనేది ప్రభుత్వ ఉద్యోగుల నిరంతర సామర్థ్యాభివృద్ధి కోసం ఉపయోగించబడే డిజిటల్‌ లెర్నింగ్‌ వేదిక. నైపుణ్యం-ఆధారిత శిక్షణ ద్వారా పరిపాలనను మెరుగుపరచడమే దీని ముఖ్య లక్ష్యం. కెపాసిటీ బిల్డింగ్‌, నైపుణ్యాల అభివృద్ధిని మెరుగుపరచడం లక్ష్యంగా గ్లోబల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు కోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించారు.

ఈ కమిటీలో మంత్రులు నారా లోకేష్‌, పయ్యావుల కేశవ్‌, పొంగూరు నారాయణ సభ్యులుగా ఉన్నారు. భవిష్యత్తు లో తెలుగుభాషలో డిజిటల్‌ కోర్సులను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురా వడానికి ప్రణాళికలు రూపొందించారు. అలాగే గ్లోబల్‌ నాలెడ్జ్‌ ఇన్‌స్టిట్యూషన్‌లతో సహ కారాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఏఐ-ఆధారిత ప్రొఫైల్‌ బేస్డ్‌ లెర్నింగ్‌ అనుభవాలను మెరుగుపరచడంపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌ను నైపు ణ్యం-ఆధారిత పరిపాలనకు జాతీయ నమూనాగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాకుండా విద్యార్థులు, ఎంఎస్‌ఎంఈలు, పారిశ్రామిక వేత్తలు కూడా డిజిటల్‌ నైపుణ్యాలను విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కర్మయోగి ఉద్యమంలో చేరి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మంచి పరిపాలన, ఆవిష్కరణ కేంద్రంగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నామని సూచించారు.

సిలికాన్‌ వ్యాలీలా ఆంధ్రా వ్యాలీ తయారు కావాలి
పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై సమీక్షలో మాట్లాడుతూ పారిశ్రామికా భివృద్ధి జరిగితే రాష్ట్రాభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే పరిశ్రమల రంగం 6.57 నుంచి 16 శాతానికి పెంచాల్సిన అవసరం ఉం ది. ఎన్విరాన్‌మెంట్‌ రంగంలో 18 శాతం, నిర్మాణం రంగంలో 10 శాతం గ్రోత్‌ రేటు పెంచాలి. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా పడి పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ద్వారా మెరుగైన ఫలితాలు పొందేందుకు కృషి చేస్తున్నాం. అందుకే పారిశ్రామికాభివృద్ధికి అధిక ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు, ఉపాధితో పాటు ఆర్థికంగా రాష్ట్రం ఎదుగుతుంది. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా విశాఖ, రాజ మండ్రి, అనంతపురం, తిరుపతి నగరాలను తీర్చిదిద్దుతున్నాం. ప్రతిఒక్కరిలో నూత నమైన ఆలోచన రావాలి. సిలికాన్‌ వ్యాలీలా ఆంధ్రా వ్యాలీ తయారు కావాలి. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని పూర్తి చేయాలి. మద్యంలో కల్లుగీత కార్మికులకు 10 శాతం ఇచ్చాం.

బడుగు బలహీన వర్గాలను ఆర్థికంగా పైకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. లాజిస్టిక్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి పోర్టులు, ఎయిర్‌ పోర్టులను అభివృద్ధి చేస్తాం. రోడ్ల గుంతలకు మరమ్మతులు చేస్తున్నాం. బెస్ట్‌ లాజిస్టిక్‌ హబ్‌గా ఏపీ అభివృద్ధి చెందబో తోంది. గత ప్రభుత్వం తీరుతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. కొత్త పాలసీలతో అన్ని రంగాలు అభివృద్ధిలో అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామిక పార్కులు మరిన్ని ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆ శాఖ కార్యదర్శి యువరా జ్‌ మాట్లాడు తూ ఎంఎస్‌ఎంఈల ద్వారా పరిశ్రమలను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 8 పాలసీల ద్వారా పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. అన్ని సెక్టార్ల ద్వారా 3 లక్షల కోట్ల ఆర్జన దిశగా ప్రయాణిస్తున్నాం. కో- ఆపరేటివ్‌ హ్యాండ్‌ ల్యూమ్స్‌కు అధిక ప్రోత్సాహం ఇస్తున్నాం.

175 నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, స్కిల్‌ డవలప్‌మెంట్‌ ద్వారా మెరుగైన శిక్షణ ఇప్పిస్తున్నామని వివరించారు. ఏపీఐఐసీ ద్వారా 2,500 కోట్లతో ప్లగ్‌ అండ్‌ ప్లే పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. పీఎం కిసాన్‌ యోజన్‌ ద్వారా రూ.2 వేల కోట్లు కేంద్రం నుంచి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నారు. ఫిషింగ్‌ హార్బర్లు, పోర్టులు అభివృద్ధికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రామాయపట్నం పోర్టు 52.91 శాతం, మచిలీపట్నం పోర్టు 31 శాతం, మూలాపేట పోర్టు 32 శాతం, కాకినాడ గేట్‌ వే పోర్టు 24 శాతం పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. అదేవిధంగా ఫిషింగ్‌ హార్బర్లు త్వరితగతిన పూర్తికి చర్యలు తీసుకున్నామని. మార్చి 2026 నాటికి బోగాపురం ఎయిర్‌ పోర్టు పనులు పూర్తి చేసి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టబోతున్నామని తెలిపారు. 300 ఎకరాల్లో డ్రోన్‌ సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. సాగర మాలకు కేంద్రం రూ. 866 కోట్లకు కేంద్ర బడ్జెట్‌ ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్స్‌, సీసీ కెమేరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు .

అన్న క్యాంటీన్లలో అడ్వయిజరీ బాడీలు
మున్సిపల్‌ పరిపాలన శాఖపై సమీక్షలో సీఎం మాట్లాడుతూ అన్న క్యాంటీన్లకు సమాజంలో అడ్వయిజరీ బాడీలను ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణలో దాతలను కూడా ప్రోత్సహించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా గుంతల రోడ్లు కనిపించడానికి వీలులేదు. తిరుపతిలో వందకు పైగా చెరువులు ఉన్నాయని అందుకే తిరుపతిని సిటి ఆఫ్‌ ట్యాంక్స్‌ అంటారు. అదేవిధంగా విజయవాడ నగరంలో కెనాల్స్‌ ఉండటంతో విజయవాడను సిటీ ఆఫ్‌ కెనాల్స్‌ అంటారు. అదేవిధంగా విశా ఖపట్నంను సిటీి ఆఫ్‌ బీచెస్‌గా పిలుస్తారని పేర్కొన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో ఏపీ టాప్‌లో నిలిచింది. అర్బన్‌ ఏరియాలో బెస్ట్‌ టాయిలెట్స్‌ గ్లోబల్‌ స్టాండర్డ్స్‌తో ఉండాలి. గత ప్రభుత్వం ఎయిమ్స్‌కు నీళ్లు కూడా ఇవ్వలేదు. నీళ్లు లేక ఓపీని కూడా నిలిపివేశారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నీళ్లు ఇచ్చాం. మొన్న రాష్ట్రపతి కూడా ఎయిమ్స్‌ను సందర్శించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజా రాజధాని అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పూర్తి చేశాం. మొత్తం 73 పనులకు 30 పనులు మౌలిక సదుపాయాలకు టెండర్లు పూర్తి చేశామని చెప్పారు. 199 అన్న క్యాంటీన్లు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రతినెలా జాబ్‌ మేళాలను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. స్వచ్ఛాంధ్ర సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని వివరించారు. 8 లక్షల మెట్రిక్‌ టన్నుల గార్బేజ్‌ను అక్టోబర్‌ 2025 నాటికి తీసివేసే దిశగా లక్ష్యంగా పెట్టుకున్నాం. విశాఖపట్టణం, విజ యవాడ మెట్రో రైలు ఫేజ్‌ 1కు డీపీఆర్‌ సిద్ధం చేసి కేంద్రానికి పంపాం. ఏపీలో టిడ్కోలో ఉన్న పెండిరగ్‌ పనులను టార్గెట్‌గా పెట్టుకుని పూర్తి చేసేందుకు ప్లాన్‌ చేసుకున్నట్లు వివరించారు.

రోడ్లపై గుంతలు కనిపించకూడదు
ఆర్‌అండ్‌బీ శాఖపై సమీక్షలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా కూడా తనకు గుంతలున్న రహదారులు కనిపించకూడదని తెలిపారు. ఇప్పుడు రోడ్లు కాస్త బాగుప డ్డాయని ప్రజలు అంటుండటం సంతోషకరమన్నారు. అయితే ఇక్కడితోనే మనం ఆగిపోకూడదని సూచించారు. రోడ్ల మరమ్మతులు చేయడం, నిర్మించడం ఒక్కటే కాదని వాటి నిర్వహణ కూడా నిరంతరం సమర్థవంతంగా చేయాలని ఆదేశించారు. ఇప్పుడు మనం చేపట్టిన రోడ్లు నిర్మాణ పనులు నాలుగేళ్లలో పూర్తికావాలన్నారు. అర్బన్‌ ఏరియాలో కూడా ఎక్కడా గుంతలున్న రహదారులు తనకు కనిపించకూడద న్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణాలు, రైల్వే నిర్మిస్తు న్న రైల్వై వంతెనల నిర్మాణాల్లో సమన్వయం ఏర్పాటు చేసుకుని ఆ పనులు ప్రగతిని కూడా సమీక్షించుకోవాలని, రాష్ట్రంలో కనెక్టివిటీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే మాట్లాడు తూ నెలాఖరులోపు రాష్ట్రంలో ఆర్‌ అండ్‌ బీ రహదారులను గుంతల రహిత రహదా రులుగా మారుస్తామని చెప్పారు. 20,059 కిలోమీటర్ల రోడ్లను గుంతల రహితంగా మార్చాలనే లక్ష్యంలో ఇప్పటికే జనవరి నెలాఖరుకు 14,168 కిలోమీటర్లు గుంతల రహితంగా మార్చినట్లు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామం నుంచి మండల కేంద్రం, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రహదారులు వేయా లనే కార్యక్రమం వేగంగా జరుగుతోందన్నారు. 2026 మార్చి నెలాఖరులోపు మండల కేం ద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రహదారుల నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు.

దేశంలోనే మొదటిసారి క్రీడా పాలసీ
క్రీడాశాఖపై సీఎం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు ఎక్కువ ప్రాధాన్య తను ఇస్తుంది. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా బెస్ట్‌ స్పోర్ట్స్‌ పాలసీని అందించాం. హర్యానా కంటే గొప్ప పాలసీని రూపొందించాం. జాతీయ, అంతర్జాతీ య క్రీడలపై క్రీడాకారులకు ధ్యాస పెంచేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు అందించాల్సి ఉంది. డిజిటల్‌ స్పోర్ట్స్‌కు ప్రాధా న్యత ఇవ్వాలి. ఫిజికల్‌ ఫిట్‌నెట్‌, స్కిల్‌ అప్‌ గ్రేడేషన్‌, వంటివి అధికారులు పరిశీల న లో ఉండాలి. ఒలింపిక్స్‌కు క్రీడాకారులను సిద్ధం చేయాలంటే ముందు నుంచి సరైన ప్రణాళిక ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. కరణం మల్లేశ్వరి రజతం పథకం వస్తే పెద్దఎత్తున సత్కరించాం. అంతేకాకుండా మనమే దేశంలోనే మొట్టమొదటిసారి గా స్టోర్ట్స్‌ పాలసీని రూపొందించింది. చిత్తశుద్ధితో మంచి క్రీడాకారులను తయారు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆ శాఖ కార్యదర్శి వినయ్‌చంద్‌ మాట్లాడు తూ క్రీడా యాప్‌ ద్వారా చాలా క్రీడలకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తున్నాం. కోచ్‌లకు సైతం ఈ యాప్‌ ద్వారా సూచనలు జారీ చేసినట్లు చెప్పారు. 2021 నుంచి ఉన్న 197 మంది క్రీడాకారుల్లో 189 మంది క్రీడాకారులకు బకాయిలు చెల్లించడం జరిగిందని తెలిపారు. 38వ నేషనల్‌ గేమ్స్‌లో గెలిచిన క్రీడాకారులకు నగదు ప్రోత్సా హకాలు అందిస్తాం. ఖేలో ఇండియా ద్వారా రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసేందుకు కేం ద్రం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో రూ.100 కోట్లయినా పనులు పూర్తి చేయించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. స్పోర్ట్స్‌ క్యాలెండర్‌ను సైతం సిద్ధం చేస్తున్నాం. స్టోర్ట్స్‌ డిజిటల్‌ సర్టిఫికేట్లను సైతం వాట్సాప్‌ ద్వారా అందించనున్నాం. పీపీపీ పద్దతిలో స్పోర్ట్స్‌ అకాడమీని రూపొందిస్తున్నట్లు చెప్పారు.

ఆర్థిక ఇబ్బందులున్నా జీతాలు, పెన్షన్లు, బకాయిలు
ఆర్థిక శాఖపై సమీక్షలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్‌ ఇచ్చిన ప్రజ ంటేషన్‌పై సీఎం స్పందించారు. గత ప్రభుత్వం వల్ల ఏర్పడ్డ నష్టాలు వెంటాడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఎనిమిది నెలల్లోనే రూ. 22,507 కోట్ల పాత బకాయిలు చెల్లించాం. ఇది ఈ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. సవాళ్లున్నా క్రమశిక్షణతో పాత బకాయిలను కూడా తీర్చగలిగేలా ఆర్థిక శాఖ పని చేయ డం సంతోషకరం. ఇందుకు ఆ శాఖ అధికారులను అభినందిస్తున్నా. గత పాల కుల నిర్వాకం వల్ల ఇంకా చెల్లించాల్సి పాత బకాయిలు చాలా ఉన్నాయి. ఇన్ని ఇబ్బందుల్లోనూ మనం ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్లిస్తున్నాం. భవిష్యత్తు లోనూ ఎన్ని కష్టాలున్నా సరే ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్ర సహకారంత అమరావతి, పోలవరం లాంటి పనులు కూడా చేపడుతు న్నామని, పెట్టుబడుల వ్యయం కింద నీటిపారుదల, రహదారులు తదితర పనులకు సం బంధించిన బిల్లులు క్లియర్‌ చేసినట్లు చెప్పారు.

త్వరలోనే డీఎస్సీ నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపడతాం. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రావాల్సిన నిధులు ఎంతమేర రాబట్టగలుగు తామో ఆ మేర రాబట్టేలా పనిచేయాలి. ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో గాడిలో పడాలంటే మరికొంత సమయం పడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కు మార్‌ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు ఈ పద్దు కింద రూ.85,445 కోట్లు చెల్లించామని తెలిపారు. ఎన్టీఆర్‌ వైద్యసేవ, ఎన్టీఆర్‌ భరోసా, దీపం 2.0 పథకాలకు ఇప్పటివరకు రూ.31,613 కోట్లు ఖర్చు చేశామన్నారు. స్థానిక సంస్థల బలోపేతం కోసం పంచా యతీలకు రూ.2,488 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడిరచారు. మొత్తం 95 సెంట్రల్‌ స్పాన్సర్డ్‌ పథకాల్లో 74 పథకాలను రివైవ్‌ చేశామని వెల్లడిరచారు.

వాట్సాప్‌లో డిజిటల్‌ హెల్త్‌ కార్డుల అనుసంధానం
వైద్యఆరోగ్య శాఖపై సమీక్షలో సీఎం మాట్లాడుతూ ఆరోగ్య సూచీలో ఏపీ దేశంలో ఏ స్థానంలో ఉందో చూసుకుని ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా సేవలు అందించా ల్సిన బాధ్యత వైద్యులపై ఉందని సూచించారు. డిజిటల్‌ హెల్త్‌ కార్డులను వాట్సాప్‌లో లింక్‌ చేయాలి. మెడికల్‌ కాలేజీలు టైం బౌండ్‌ పెట్టుకుని పూర్తి చేయాలి. మెడికల్‌ ఇన్సూరెన్స్‌ను వీలైనంత త్వరగా చేపట్టాల్సి ఉంది. టాటా మోడల్‌ చిత్తూరులో విజయ వంతం అయితే బిల్‌గేట్స్‌ కూడా మనతో కలిసి పనిచేసేందుకు ముందుకువస్తామని చెప్పినట్లు తెలిపారు. ప్రజలు అనారోగ్య బారినపడి చికిత్స చేయించుకోవడానికి ఇబ్బం దులు పడటానికి వీల్లేదు. ప్రభుత్వ అసుపత్రులు సైతం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండే లా చూసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ గ్రామస్థాయిలో సైతం గర్భిణులకు ఇబ్బందులు రాకుండా టెలీ కన్సల్టేషన్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం ద్వారా 11.45 లక్షల మంది చికిత్స పొందారు. అన్ని ఆసుపత్రుల్లో ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ కార్డ్‌ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో భాగం గా కేంద్రం రూ.1,416.94 కోట్లు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. 5 స్కిల్‌ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిందని వివరించారు. 9 క్యాన్సర్‌ కేర్‌ ఆసుపత్రులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మెడిసిటీ ద్వారా మెడికల్‌ టూరిజానికి ప్రాధాన్యం ఇస్తున్నా మని చెప్పారు. అందుకు 200 ఎకరాలు కావాల్సి ఉంది. పీఎంజేవైలో భాగంగా కేంద్రం నుంచి రూ.520 కోట్లు రావాల్సి ఉంది. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలు బీమా ఇవ్వా లని ప్రభుత్వం కార్యచరణ రూపొందించింది. ప్రతి పౌరుడికి డిజిటల్‌ హెల్త్‌ కార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. గుండెకు భరోసా పేరుతో గుండె జబ్బులు ఉన్న వారిని ఆదు కుంటున్నామని తెలిపారు.

పారదర్శకంగా ఉచిత ఇసుక
భూగర్భ గనుల శాఖపై శాఖ ముఖ్యకార్యదర్శి ముకేశ్‌కుమార్‌ మీనా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జూన్‌ నెల నుంచి రాష్ట్రంలో అమలు చేస్తుండగా పూర్తిస్థాయిలో సెప్టెంబర్‌ నెల నుంచి అమలు చేస్తున్న ట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు ఉచిత ఇసుకను అందు బాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. కొత్త రీచ్‌లను కూడా అందుబాటులోకి తెస్తున్నా మని రీచ్‌లలో కొత్తగా 15 శాతం రిజర్వేషన్లను వడ్డెర కులస్తులకు కేటాయించామని తెలిపా రు. రీచ్‌ల వద్ద సీసీ కెమేరాలు ద్వారా పర్యవేక్షణతో పాటు గోదావరి, ఎన్టీఆర్‌ జిల్లాల్లో కలెక్టర్లు రాత్రి పూటి తనిఖీలు కూడా చేస్తున్నారని చెప్పారు. వాట్సాప్‌ ద్వారా సమీక్షతో పాటు కృత్రిమ మేధను కూడా ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. ఇసుక రీచ్‌ల వద్ద వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు డ్రోన్ల ద్వారా సర్వేలు చేస్తున్న ట్టు వివరిం చారు.

నాలుగు పాలసీలతో ఐటీ అభివృద్ధి
ఐటీ, ఎలక్ట్రానిక్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌పై సమీక్షలో ఆ శాఖ కార్యదర్శి యువరాజ్‌ మాట్లాడుతూ 4 పాలసీల ద్వారా ఐటీ రంగాన్ని తీర్చిదిద్దుతున్నాం. విద్యార్థులకు 10 వేల మందికి సాంకేతికతంగా శిక్షణ ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. డిజిటల్‌ భారత్‌ నిధి పథకం కింద 4జీ టవర్లను ఏర్పాటు చర్యలు తీసుకున్నామని వివరించారు. హెచ్‌డీఎఫ్‌ఎసీతో అంకుర పరిశ్రమలకు ఎంవోయూ చేసుకున్నామని, 4.0 పాలసీ ద్వారా 2024-29 నాటికి రూ.40 వేల కోట్లు పెట్టుబడులు, లక్షల ఉద్యో గాలు, ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 11-02-2025

Next Post

రాష్ట్ర పర్యాటక రంగానికి మహర్దశ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-07-2025

కార్యకర్త
@ July 3, 2025
ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

చైతన్యరధం
@ July 3, 2025
చదువుల పండుగకు సర్వం సిద్ధం..!
ఆంధ్రప్రదేశ్

చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చైతన్యరధం
@ July 3, 2025
త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌
ఆంధ్రప్రదేశ్

త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

చైతన్యరధం
@ July 3, 2025
పెద్దకొడుకులా సేవ చేస్తున్నా
ఆంధ్రప్రదేశ్

పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

చైతన్యరధం
@ July 3, 2025
కుప్పం అభివృద్ధికి రూ.1617 కోట్ల ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

కుప్పం అభివృద్ధికి రూ.1617 కోట్ల ఒప్పందాలు

చైతన్యరధం
@ July 3, 2025
గడపగడపలో సీఎం
ఆంధ్రప్రదేశ్

గడపగడపలో సీఎం

చైతన్యరధం
@ July 3, 2025
చైతన్యరధం ఈ పేపర్ 02-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-07-2025

కార్యకర్త
@ July 2, 2025
Load More

ముఖ్య వార్తలు

సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

చైతన్యరధం
@ July 2, 2025
మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

చైతన్యరధం
@ June 25, 2025
వరద జలాలే వాడతాం

వరద జలాలే వాడతాం

చైతన్యరధం
@ June 25, 2025
ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

చైతన్యరధం
@ June 25, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం!

చైతన్యరధం
@ July 1, 2025 6:30 AM
బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

చైతన్యరధం
@ July 1, 2025 6:25 AM
ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2025 6:55 AM

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

చైతన్యరధం
@ June 18, 2025 6:05 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

చైతన్యరధం
@ July 3, 2025
చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చైతన్యరధం
@ July 3, 2025
త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

చైతన్యరధం
@ July 3, 2025
పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

చైతన్యరధం
@ July 3, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist