- మెడికల్ కాలేజీల నిధులలు మింగేసిన వైనం
- చిత్తుచిత్తుగా ఓడినా మారని చపలచిత్తం..
- అబద్ధాలే పునాదిగా దుష్ట శకుని రాజకీయం
- కూటమి ప్రభుత్వంపై పూటకో అబద్ధం
- రోజుకో కుట్రతో జనంముందుకు జగన్‌రెడ్డి
ప్రతిపక్ష హోదారాని స్థాయిని ప్రజలు కట్టబెట్టినా.. జగన్‌రెడ్డిలో కించిత్తు మార్పూ కానరావట్లేదు. వైసీపీ సిద్ధాంతమైన అబద్ధాలనే పదేపదే వల్లిస్తూ.. తన విష పత్రికలో అసత్య కథనాలు వండి వారుస్తూ.. మరింత దిగజారుతోన్న ఘట్టాలకే పదును పెడుతున్నాడు. గడిచిన ఐదేళ్ల అధికార కాలంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని గాలికొదిలేసి.. విద్యార్థుల వైద్య విద్య కలను కాటేసి.. పదవీచ్యుతుడైన జగన్‌రెడ్డి.. అనునిత్యం కూటమి ప్రభుత్వంపై విషంగక్కుతున్నది `తన అసమర్థతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే!
మీ పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్ ఏదైనా చదివించండి. లక్షల ఫీజులైనా నేనే కడతానని ప్రతిపక్షంలో గొంతుచించుకున్న జగన్‌రెడ్డి.. అధికారంలోకి రాగానే పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసాడన్నది జగనెరిగిన సత్యం. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలంటూ వగల మాటల పలికిన వైసీపీ అధినేత.. ఆచరణలో ఆయా వర్గాల ప్రతిభపై పగనే చూపాడు. మెడికల్ సీట్లును మార్కెట్‌లో అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకున్నాడు. 17 మెడికల్ కాలేజీలు తెస్తానని ఊరువాడా డప్పుకొట్టి.. ఆర్భాటపు ప్రచారం చేసి.. 12 మెడికల్ కాలేజీలను పునాదులు కూడా దాటించని అసమర్థుడు జగన్. ఐదేళ్లలో ఆపసోపాలు పడి తెచ్చిన ఐదు కాలేజీలూ.. ఇప్పటీకీ అసంపూర్ణ నిర్మాణాలుగా వెక్కిరిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లను కన్వీనర్ (మెరిట్) కోటాలో భర్తీచేస్తున్న గత విధానానికి తిలోదకాలిచ్చి.. ఏబీసీ కేటగిరీలుగా విభజించి సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంలో సీట్లు అమ్ముకున్న ఘనుడు జగన్! తాను చేసిన పాపాలకు ప్రజలు తగిన ప్రాయశ్చిత్తం కల్పించారన్న జ్ఞానాన్ని విస్మరించి.. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గన్న చందాన.. ఆర్నెల్లు తిరక్కుండానే కూటమి ప్రభుత్వంపై కుత్సిత విమర్శలకు దిగజారడం జగన్‌కే సాధ్యం!
మెడికల్ కాలేజీల నిర్మాణం పేరిట దోపిడీ
మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్‌రెడ్డి చెప్పిన వ్యయం రూ.8,480 కోట్లు. ఇందులో కేంద్రం రూ.975 కోట్లవరకూ ఇచ్చింది. మెడికల్ కాలేజీల నిర్మాణం పేరిట నాబార్డునుంచి రూ.4,948 కోట్లు అప్పులు తెచ్చారు. ఇవికాకుండా కాలేజీల నిర్మాణానికి ఆరోగ్యశ్రీ నిధుల మళ్లింపు అదనం. ఇంతాచేస్తే జగన్‌రెడ్డి సర్కారు పూర్తిచేసిన పనులు అంతంతమాత్రం. కేవలం రూ.2,125 కోట్ల విలువైన పనులు చేసి చేతులు దులుపుకున్న జగన్‌రెడ్డి.. కాంట్రాక్టర్లకు రూ.1,451 కోట్లు మాత్రమే చెల్లించి రూ.674 కోట్ల బిల్లులు బకాయిలు పెట్టాడన్నది అసలు నిజం. అంటే… ఐదేళ్లలో 25శాతం పనులు కూడా చేయకపోగా.. కాంట్రాక్టర్లకు 16శాతం బిల్లులే చెల్లించాడన్నమాట. ఇదిచాలు `వైద్య విద్యపట్ల జగన్‌రెడ్డి చూపిన శ్రద్ధ.. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసిన వైనం అర్థం చేసుకోవడానికి.
కాలేజీల నిర్మాణం పేరిట చేసిన అప్పులు, కేంద్రం ఇచ్చిన నిధులు, కాంట్రాక్టర్లకు పెట్టిన బకాయిలకు సంబంధించిన డబ్బులు మొత్తం రూ.6వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. కాంట్రాక్టర్లకు డబ్బులు ఎగ్గొట్టి మెడికల్ కాలేజీల పేరిట రూ.6వేల కోట్లు దోచుకున్న జగన్‌రెడ్డి.. మొన్నటి ప్రెస్‌మీట్‌లో ఈ రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తెచ్చి సంపద సృష్టించినట్టు తనపైతానే అతిశయపు పొగడ్తలు కురిపించుకోవడం.. కూటమి ప్రభుత్వం వైద్య వైద్యను ప్రయివేట్‌పరం చస్తోందని మాట్లాడటం `జగర్‌రెడ్డి చేస్తోన్న సరిదిద్దుకోలేని తప్పులు. జగన్ ప్రభుత్వం చేసిన చేసిన అప్పులు, ఆర్ధిక విధ్వంస పాపం కూటమి ప్రభుత్వానికి శాపంగా పరిణమించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వయబిలిటీ గ్యాప్ ఫండిరగ్ ద్వారా మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తిచేసి వీలైనంత త్వరగా అడ్మిషన్లకు అనుమతి పొందాలన్న కూటమి ప్రభుత్వ ప్రయత్నాలను చెడగొట్టడానికి జగన్‌రెడ్డి విషప్రచారానికి ఒడిగట్టడం దారుణం.. క్షమించరాని నేరం! జగన్‌రెడ్డి కాంట్రాక్టర్లకు పెట్టిన బకాయిలలో రూ.395 కోట్లు కూటమి ప్రభుత్వం చెల్లించి పనులను ముందుకు నడిపిస్తుంది. ఈ విషయాలకు వక్రీకరించి.. జగన్‌రెడ్డి సాగిస్తోన్న అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్ముతారనుకోవడం అతని మూర్ఖత్వం.
బడుగుల వైద్య విద్య కల చిదిమేశాడు
2019నాటికే అందుబాటులో ఉన్న మెడికల్ కాలేజీల పీజీ సీట్ల కోసం కేంద్రం ఇచ్చిన రూ.700 కోట్ల నిధులనూ కొత్త కాలేజీల నిర్మాణానికి మళ్లించిన జగన్‌రెడ్డి `ఎంబీబీఎస్ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ మొసలి కన్నీరు మొదలుపెట్టాడు. పీజీ సీట్ల కోసం కేటాయించిన నిధులను వాటికోసమే వాడకపోతే.. ఆ సీట్లు రద్దయిపోతాయన్న ఇంగితాన్ని విస్మరించి.. జగన్ అడ్డదిడ్డంగా ముందుకెళ్లింది వాస్తవం కాదా? పీజీ సీట్లు రాకున్నా పర్లేదు… ఎంబీబీఎస్ సీట్లు చాలనుకున్నాడో.. లేక 30 ఏళ్లు అధికారంలో ఉంటామన్న అహంభావంతో చెత్త నిర్ణయాలకు ఒడిగట్టాడో జగనే సమాధానం చెప్పాలి.
ఇదీ వాస్తవం:
2023-24లో అనుమతి పొందిన విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లకు అయిష్టంగానే అంగీకరించిన జాతీయ వైద్య మండలి.. ఆ తర్వాత పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల్లో కళాశాలల నిర్మాణాలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో భవన నిర్మాణాలే పూర్తికాకపోవడం, కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం, వైద్య సిబ్బంది నియామకాలపై దృష్టి పెట్టకపోవడంవంటి కారణాలతో అడ్మిషన్లకు నిరాకరించింది.
ఈక్రమంలో పులివెందుల, పాడేరులో చెరో 50 సీట్ల భర్తీకి ఆమోదం తెలుపుతామని.. అయితే ఇందుకు ఏపీ ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇవ్వాలని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. పాడేరు కళాశాల నిర్మాణానికి కేంద్రం మొత్తం ఖర్చు భరిస్తున్నందున.. 50 సీట్లలో అడ్మిషన్లకు అనుమతిచ్చింది. పులివెందులలో నిర్మాణాలు పూర్తికానందున అండర్ టేకింగ్ ఇచ్చే పరిస్థితి లేకపోయింది. మిగిలిన ఏడు కాలేజీలు పార్వతీపురం, నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ, పిడుగురాళ్లలో పనులు కనీసం పునాదులు కూడా దాటలేదు. ఈ వాస్తవాలను తన విషపు రాతలు, అబద్ధపు ప్రచారాలతో కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయడం జగన్‌రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిలువెత్తు నిదర్శనం.
వైద్య విద్యకు పట్టంగట్టిన ఎన్టీఆర్, చంద్రబాబు
అన్న ఎన్టీఆర్ రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో 1986లో విజయవాడకు హెల్త్ యూనివర్సిటీ తెచ్చారు. అలాగే అమెరికానుంచి ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావును స్వదేశానికి రప్పించి హైదరాబాద్ నిమ్స్‌కు డైరెక్టర్‌ను చేసి ఆస్పత్రిని తీర్చిదిద్దారు. జిల్లాకో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది చంద్రబాబు. ప్రభుత్వ, ప్రయివేట్ కలిపి 22 మెడికల్ కాలేజీలతోపాటు కేంద్రంతో మాట్లాడి మంగళిగిరిలో ఎయిమ్స్, తిరుపతిలో బర్డ్ ఆస్పత్రి, టాటా క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ తెచ్చిన ఘనత చంద్రన్నదే. 2015లో కేంద్రం నుంచి చంద్రబాబు ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చి మంగళగిరిలో 207 ఎకరాల భూమి కేటాయించారు. చంద్రబాబు ముందుచూపుతో తీసుకొచ్చిన ఎయిమ్స్‌కు కృష్ణా, గుంటూరు జిల్లాలనుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి రోగులు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. కానీ జగన్‌రెడ్డి అదే ఎయిమ్స్‌కు గుక్కెడు నీరివ్వకపోగా, ఆస్పత్రి రహదారి నిర్మాణం పూర్తికాకుండా ఆటంకాలు సృష్టించాడు. ఇప్పుడేమో మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరమంటూ దుష్ప్రచారానికి దిగాడు. జగన్ రాజకీయ నైజాన్ని ఒకసారి రుచి చూసిన ప్రజలు.. తన మాటలను మళ్లీ విశ్వసిస్తారనుకోవడం అవివేకం. ఐదేళ్లకాలంలో రాష్ట్రాన్ని విధ్వంసానికి గురి చేసిన జగన్‌రెడ్డి.. మరోసారి తన అబద్ధాలు, కట్టుకథలను ప్రజలు నమ్ముతారనుకోవడం మూర్ఖత్వం!
వైద్య కళాశాలల కోసం వైసీపీ సర్కారు చేసిన ఖర్చు (కోట్లలో)
కాలేజీ నిర్మాణ వ్యయం నాబార్డు రుణం చేసిన పనులు పెండిరగ్ బకాయిలు
విజయనగరం 500 500 169 63
మార్కాపురం 475 275 75 28
మదనపల్లి 475 275 71 41
పులివెందుల 500 275 371 79
ఆదోని 475 500 71 24
నర్సీపట్నం 500 375 27 15
అమలాపురం 475 475 109 50
పాలకొల్లు 475 275 70 70
బాపట్ల 505 297 69 49
పెనుగొండ 475 275 54 25
పార్వతీపురం 600 150 (టెండర్ల దగ్గరే ఆగింది)
కేంద్ర నిధులతో నిర్మిస్తున్న కాలేజీలు
పాడేరు 500 325 156 39
మచిలీపట్నం 550 325 248 40
పిడుగురాళ్ల 500 325 217 39
కేంద్ర ప్రత్యేక సహకారం, ఆరోగ్యశ్రీ నిధులు
రాజమండ్రి 475 80 156 25
ఏలూరు 525 199 248 34
నంద్యాల 475 82 118 28
మొత్తం 8,480 4,948 2,125 674