- కూటమి ప్రభుత్వంలోనే వారికి న్యాయం
- ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తినను గెలిపించాలి
- 20 లక్షల ఉద్యోగాలు, భృతి అమలుచేస్తాం
- ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మెగా డీఎస్సీ
- పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పిలుపు
- కూటమి శ్రేణులకు, నాయకులకు దిశానిర్దేశం
నిడదవోలు(చైతన్యరథం): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తు ల రాజశేఖరానికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి పేరాబత్తుల రాజశేఖరంను అఖండ మెజా రిటీతో గెలిపించాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. బుధవారం నిడదవోలు పరిధిలోని కానూరు వైనాట్ ఫంక్షన్ హాలులో జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామా నాయుడు ఆధ్వర్యంలో కూటమి శ్రేణులతో సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నా రు. గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదైన యువత నూటికి నూరు శాతం కూటమి అభ్యర్థికి ఓటు వేసే విధంగా రానున్న 20 రోజుల్లో అవగాహన కల్పించాలని దిశా నిర్దేశం చేశా రు. ఎవరైనా గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదు కాకపోయి ఉంటే నమోదు చేయించాలని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కూటమి విజయదుందుభి మోగించాలని ఆకాంక్షించారు. గడిచిన ఏడు నెలల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృ ద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగించాలంటే ఎమ్మెల్సీ ఎన్ని కల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అభివృద్ధి అనేది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు.. కానీ ఏపీలో అభివృద్ధి అనేది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేశామన్న విషయాన్ని వివరించాలని తెలిపారు. ఎన్నికల కోడ్ అనంతరం మెగా డీఎస్సీ అమలు చేయబోతున్నట్లు చెప్పారు.
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పనిచేస్తున్నారన్నారు. త్వరలోనే నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతిని సైతం అమలు చేసి తీరుతామన్నా రు. గత ప్రభుత్వం డీఎస్సీ వేయకుండా నిరుద్యోగులను దగా చేసిందన్నారు. సాధారణ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానా యుడు, నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉపసభాపతి బూరుగడ్డ వేద వ్యాస్, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి జవహ ర్, బీజేపీ రాజమండ్రి అధ్యక్షుడు టి.నాగేంద్ర, బూరుగుపల్లి రాఘవం, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, బీజేపీ అధ్యక్షుడు బండి సత్యనారాయణ, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు దాసరి సత్యనా రాయణ, బీజేపీ సీనియర్ నాయకులు వర్మ, కూటమి నాయకులు, కూటమి కార్యకర్త లు తదితరులు పాల్గొన్నారు.