- లేకుంటే చెప్పులతో సన్మానం తప్పదు
- ఎన్ని అడ్డుపుల్లలు వేసినా అభివృద్ధి ఆగదు
- మద్యం షాపులు కేటాయించి తీరుతాం
- ఇది ప్రజాప్రభుత్వం..బీసీల ప్రభుత్వం
- చంద్రబాబు వల్లే బీసీలకు న్యాయం
- టీడీపీ అధికార ప్రతినిది శ్యామ్‌చంద్ర శేషు
మంగళగిరి(చైతన్యరథం): జీవో 13 ద్వారా 10 శాతం గీత కులాలకు మద్యం షాపులు ఇచ్చి గీత కులాల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు ఆలోచిస్తుం టే.. వైసీపీ నాయకులు, మద్దతుదారులు రిట్ పిటిషన్లు వేసి దాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌చంద్ర శేషు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమం త్రిగా ప్రమాణస్వీకారం చేశాక బీసీలను అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తు న్నారు. కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నారు. కల్లు గీత మీద ఆధారపడ్డ కులాలైన గౌడ, ఈడిగ, శెట్టిబలిజ, శ్రీశైన, యాత కులాలకు ఆర్థికంగా వారికి పరిపుష్టినందిస్తూ వారి అభివృద్ధికి మంచి అవకాశాలు కల్పించారు. జీవో నెంబర్ 13 ద్వారా కల్లు గీత కులాల కు మద్యం షాపుల్లో 10 శాతం వాటా ఇచ్చి గీత కులాలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. 330 షాపులు ఈ రాష్ట్రంలో గీత కులాలకు కేటాయిస్తే దాన్ని వైసీపీ నాయకులు ఓర్వలేకపోయారు. వాటి మీద కేసులు వేశారు. టెండర్లు కూడా వేయనీయలేదు. క్యాన్సిల్ చేసుకోండి లేకుంటే మీ డబ్బులన్నీ పోతాయని భయపెడు తున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరి గిన బీసీల సమావేశంలో తాము కల్లు గీత పనిపైనే ఆధారపడి బతుకుతున్నామని, తమకు అనేక ఇబ్బందులున్నాయని తాటి చెట్లు ఉండడం లేదని, మాకు వ్యాపారంలో అవకాశాలు కల్పించాలని కోరారు. చంద్రబాబు మీకు తోడున్నానని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నప్పుడు కల్లుగీత కార్మికులు తమ గోడు వినిపించుకున్నారు. అధికారంలోకి రాగానే సహాయం చేస్తోందని ఆనాడు వారికి భరోసా కల్పించారు. చెప్పిన మాట ప్రకారం గీత కులాలకు మద్యం షాపుల్లో పది శాతం వాటా కేటాయించారని తెలిపారు.
అంతా వైసీపీకి చెందిన వారే
గీత కార్మికులకు మద్యం షాపులు దక్కకుండా జగన్ వారి అనుచరులు, పార్టీ సానుభూతిపరులు గీత కులాలపై కక్ష గట్టి 20 పిటీషన్లు వేశారు. వాటిలో 12 వైసీపీకి చెందిన వారివేనని తెలిపారు. కోర్టులో పిటిషన్లు వేసిన వారిలో వైసీపీకి చెందిన కె.రఘు వీర్ ఉన్నారు. ఈయన వైసీపీ నాయకులకు న్యాయ సలహాదారుడు. ఈయన గతంలో గవర్నమెంట్ ప్లీడర్‌గా పనిచేశారు. మనోహర్‌రెడ్డి, వేదుల వెంకటరమణ, పి.మరమే శ్వరరావు, శ్రీమన్నారాయణ, రత్నాంగ ఫణిరెడ్డి, నాగుల ఐశ్వర్య, కడపకు చెందిన వీఆర్ రెడ్డి, సీ. ప్రకాశ్‌రెడ్డి, కిరణ్ తిరుమలశెట్టి, జి.ఎల్.నాగేశ్వరరావు వీరందరూ వైసీపీకి చెందినవారే. వీరు వైసీపీ పెద్ద నాయకులకు అత్యంత సన్నిహితులేని తెలిపారు. గుంటూ రుకు చెందిన జీఎల్ నాగేశ్వరరావు విజయసాయి, అంబటి రాంబాబుకు దగ్గరి వారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు పెట్టిందిలేదు..చేసింది లేదు. కార్పొరేషన్‌లు పెట్టి ఒక్క పైసా ఈ కులాలకు ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు హయాంలో 2014లో రూ.250 కోట్లు ఖర్చు చేశారు. ప్రజలు ఓట్లు వేసి మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక అభివృద్ధిని అడ్డుకోవ డానికి వైసీపీ నాయకులు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు.
అభివృద్ధిని అడ్డుకోవద్దు…
చేతనైతే కులాల్లో పేదలకు సహాయం చేయండి. చంద్రబాబు చేస్తున్న మేలును అడ్డు కోవడానికి, అణగదొక్కడానికి ప్రయత్నించొద్దు..వారిలో కసి, పగ రగల్చవద్దని హితవు పలికారు. బీసీలపై కక్ష ఉందని వైసీపీ పెట్టిన కేసులతో అర్థమవుతుందన్నారు. రేపల్లెలో 14 సంవత్సరాల బాలుడు అమర్నాథ్ గౌడ్‌ను కాళ్లు చేతులు కట్టి అమానవీయంగా హిం సించారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ కనీస పలకరింపుపకు కూడా రాలేదు. అందుకే బీసీలు ఓటు వేయకుండా 11 సీట్లతో బుద్ధి చెప్పారు. ఇలాగే వ్యవహరిస్తే ఆ 11 సీట్లు కూడా రావని హితవుపలికారు. పులివెందులలో కూడా ఘోరీ కట్టడం ఖాయమని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో 2014-19లో బీసీల అభ్యున్నతికి చంద్రబాబు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం నయాపైసా కూడా ఖర్చు పెట్టలేదు. అమ్మఒడి, రైతు భరోసా, కాపు నేస్తం బీసీలకు ఇచ్చానని మోసపు మాటలు మాట్లాడు తున్నారు. కూటమి ప్రభుత్వం రూ.38 వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టి కులాలను అభివృద్ధి చేస్తోంది. వైసీపీ నాయకులు అవాకులు, చవాకులు పేలుస్తున్నారు. అప్పటి వైసీపీ నాయ కులు ప్రతిపక్ష నేతల ఇళ్లకు పంపి దాడులు చేయించారు. బూతులు తిట్టించారు. జోగి రమేష్ లాంటి వారిని ఆ కులం వారే ఈసడిరచుకుంటున్నారు. రానున్న రోజుల్లో వైసీపీ నాయకులు ఏ బీసీ కాలనీకి వెళ్లినా…ఏ బీసీ బిడ్డను పలకరించినా చెప్పులతో స్వాగతం పలికే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. 11 సీట్లతో బుద్ధి చెప్పినా బీసీలను ఇంకా అణగ దొక్కాలని చూస్తున్నారు. తప్పులను ఒప్పుకుని బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. లేకుంటే గౌడ జాతిబిడ్డ లందరూ తీవ్రంగా ప్రతిఘటిస్తారని హెచ్చరించారు. జగన్‌రెడ్డి ప్రభుత్వంలో వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. గౌడ కులాలకు చెందిన మద్యం దుకాణాలు ఊరికి వంద మీటర్ల దూరంలో పెట్టుకోవాలని చెప్పి 4 వేల దుకాణా లు కనుమరుగయ్యేలా చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు గౌడ జాతి వారు చెట్లు ఎక్కితే ఎక్కకుండా అధికారాన్ని ఉపయోగించి వారి జీవితాల్ని నాశనం చేశారు. కూటమి ప్రభు త్వం ప్రజా ప్రభుత్వం, బీసీల ప్రభుత్వం..ఎన్ని అడ్డుపుల్లలు వేసినా పది శాతం మద్యం దుకాణాల కేటాయింపు ఆగదు..బీసీల అభివృద్ధి ఆగదు..వైసీపీ సమాధి ఖాయమని స్పష్టం చేశారు.