- సేవల విషయంలో ఏ మాత్రం రాజీ వద్దు
- అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి
- 30 పాయింట్ల కార్యాచరణ అమలు చేయాలి
- ఐవీఆర్‌ఎస్‌లో లోపాలను మెరుగుపర్చుకోవాలి
- వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి(చైతన్యరథం): ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవల విషయంలో రోగులు సంతృప్తే ప్రాతిపదికగా డాక్టర్లు పనిచేయాలని వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాద వ్ సూచించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో(జీజీహెచ్‌లు) సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు, అడ్మినిస్ట్రేటర్లు సమన్వయంతో పనిచేసినప్పుడే మెరుగైన ఫలితాలు సాధిం చగలుగుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జీజీహెచ్‌ల సూపరింటెండెంట్లతో ఐవీఆర్‌ఎస్ ఫీడ్ బ్యాక్‌పై బుధవారం వెలగపూడి సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్ల అందుబాటు, పరిశుభ్రత, మందుల సరఫరా, సిబ్బంది ప్రవర్తన, అవినీతి తదితర అంశాలపై ఐవీఆర్ ఎస్ సర్వేలో వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు ఎక్కడెక్కడ లోపాలున్నాయో సవరించుకుని సేవల ను మెరుగుపర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో 30 పాయింట్ల కార్యాచరణ ప్రణాళిక అమలు విషయంలో కొంతమేర ప్రగతి కనిపించినప్పటికీ మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరముందన్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో స్ట్రెచర్లు, వీల్ చైర్స్ లేక గర్భిణులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి చిన్న చిన్న సమస్యల పట్ల దృష్టి సారించాలని సూచించారు. ఉదయం రోగులను ఏ డాక్టరైతే చూస్తారో టెస్ట్‌ల రిపోర్టు లొచ్చాక సాయంత్రం అదే డాక్టర్ చూసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఐవీఆర్ ఎస్ సర్వేలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సేవలు మెరుగుపర్చేందుకు సూపరింటెం డెంట్లు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, పేద రోగులు సంతృప్తి చెందేలా సేవలందించే విషయంలో ఏ మాత్రం తాత్సారం ఉండకూడదని స్పష్టం చేశా రు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ ఐవీ ఆర్‌ఎస్ సర్వే ఆధారంగా సేవలు ఎంతమేరకు మెరుగుపర్చగలమనేది దృష్టిలో ఉంచుకుని పనిచేయాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సేవల విషయంలో సూపరింటెండెం ట్లే పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు. ఇ-హెల్త్ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్య తనివ్వాలని సూచించారు. రోగి ఏ ఆసుపత్రికి వెళ్లినా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ (ఇహెచ్ ఆర్) అందుబాటులోకొస్తే సేవలు మరింత సులభతరమవుతాయని తెలిపారు. వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) నరసింహం వర్చువల్‌గా పాల్గొన్నారు.