- సమస్యలపైనే కేంద్రమంత్రులను కలిశా
- రావాల్సిన బిల్లులు త్వరగా ఇవ్వాలని కోరాం
- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై వివరించా
- ఎన్‌సీసీ డైరెక్టరేట్, ఎడ్యుకేషన్ సదస్సుకు విజ్ఞప్తి చేశా
- ఆలయాల్లో అన్యమతస్తుల తొలగింపు సాధారణమే
- విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
దిల్లీ: రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కేంద్ర మంత్రులను కోరినట్టు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దిల్లీలో బుధవారం పలువురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కేంద్రమంత్రులకు వివరించా.. వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించాం. విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆరా తీశారు. కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు త్వరగా ఇవ్వాలని కోరా. విశాఖ స్టీల్ ప్లాంటుకు ప్యాకేజీ ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు చెబుతూ 20 లక్షల ఉద్యో గాలు ఇస్తామనే హామీకి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఐటీ సేవలు, గ్రీన్ హైడ్రో జన్, రెన్యువబుల్ ఎనర్జీ విస్తరిస్తామని పేర్కొన్నారు. దేవాలయాల్లో ఇతర మతాచారాలు పాటించే వారిని తప్పించడం సాధారణమే తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా ఇంకా పలువురిని కలుస్తాం. ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకే ప్రశాంత్ కిశోర్‌ను కలిసినట్లు తెలిపా రు. ఐదేళ్ల వైకాపా పాలనలో విద్యావ్యవస్థ దారుణంగా దెబ్బతింది. వైకాపా పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు తగ్గారు.
ఐదేళ్లలో 45 లక్షల నుంచి 32 లక్షలకు పిల్లలు తగ్గిపోయారు అని లోకేశ్ వివరించారు. పరిపాలనలో ఏఐ పరిజ్ఞానం గురించి వివరించినట్లు చెప్పారు. వైసీపీ పాలనలో కొన్ని వర్సిటీలను రాజకీయంగా వాడుకున్నా రు.. రాష్ట్రంలో ఎన్‌సీసీ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఎడ్యుకేషన్ సదస్సును విశాఖలో ఏర్పాటు చేయాలని కోరాం. టెక్నాలజీ వినియోగించి అన్ని విభా గాల్లో ముందుకెళ్లాలని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వచ్చిన భయమేమీ లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదని కేంద్రమంత్రే చెప్పారు. నిర్వహణ సరిగా లేకే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు వచ్చాయి. కేప్టివ్ మైన్స్ లేకుండానే అనేక స్టీల్ ప్లాంట్లు నడుస్తున్నా యి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను లాభాలబాట పట్టించేందుకు కృషి చేస్తున్నామని వివరించా రు. దిల్లీలో బీజేపీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఇక్కడ హాఫ్ ఇంజిన్ ప్రభుత్వం వద్దు.. డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని ప్రజలు కోరుకున్నారు. ఎన్డీయే మరింత బలోపే తం అవుతుందన్నారు. జగన్ కుటుంబంలో ఎవరికీ భద్రత తగ్గించలేదని.. నిబంధనల ప్రకారమే భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. వైసీపీ 1.0నే ఇంకా మర్చిపోలేకపోతున్నారు ..ఇక 2.0 ఎక్కడ నుంచి వస్తుందని వ్యాఖ్యానించారు.