భారత అమ్మాయిలు అద్భుతం చేశారు. మహిళల అండర్ 19 టీ20 వరల్డ్ కప్‌లో అదరగొట్టారు. తుది పోరులో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో ఛేదించి విశ్వవిజేతలుగా నిలిచారు. తెలుగమ్మాయి, ఓపెనర్ గొంగడి త్రిష (44, 3/15) ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. గొంగడి త్రిష టోర్నీ ఆసాంతం బ్యాటింగ్, బౌలింగ్లో సత్తా చాటింది. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా, ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్ అవార్డులు సొంతం చేసుకుంది.
దేశానికే గర్వకారణం
` సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): టీ 20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత మహిళల అండర్`19 జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. సమష్టి కృషి, దృఢ సంకల్పం, పట్టుదలతో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశారని ప్రశంసించారు. దేశానికి కీర్తి తీసుకురావడమే కాకుండా, అసంఖ్యాక యువతులను స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ విజయం పట్ల దేశం మొత్తం గర్విస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు.
వరల్డ్‌కప్ విజేతలకు మంత్రి నారా లోకేష్ అభినందనలు
` తెలుగమ్మాయి త్రిష ప్రదర్శన గర్వకారణమని ప్రశంస
అమరావతి (చైతన్యరథం): డిఫెండిరగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టి రెండో సారి మహిళల అండర్-19 టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలియజేశారు. మన అమ్మాయిలు సమష్టి ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడిరచి అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడిరపజేశారని కొనియాడారు. టోర్నీ మొత్తం తనదైన బ్యాటింగ్, బౌలింగ్‌తో అద్భుత ప్రదర్శన చేసిన తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష అందరికీ గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. భారత మహిళల జట్టు భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.
దేశానికే గర్వకారణం: మంత్రి మండిపల్లి
మహిళ అండర్ 19 టీ 20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ప్రపంచకప్ గెలిచిన భారత్ విశ్వవిజేతగా అవతరించటం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో మన అమ్మాయిలు జయభేరి మోగించడం దేశానికి గర్వకారణమన్నారు. ఫైనల్లో సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించడం గర్వంగా ఉందన్నారు. తెలుగమ్మాయి త్రిష అధ్బుతమైన ప్రదర్శనతో భారత్ విజయాన్ని అందుకోవటం మరింత గర్వకారణమని మంత్రి మండిపల్లి అన్నారు.
దేశఖ్యాతిని చాటిచెప్పారు: మంత్రి అచ్చెన్నాయుడు
అండర్-19 ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ సాధించిన భారత్ జట్టు క్రీడాకారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు అభినందనలు తెలియజేశారు. ఫైనల్లో సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం గర్వకారణమన్నారు. గెలుపులో కీలక పాత్ర పోషించిన మన తెలుగమ్మాయి త్రిషకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. విజేతలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో బాలికలు క్రీడల్లో రాణించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు.
దేశం గర్విస్తోంది: ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
అండర్-19 మహిళల టీ-20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌత్ ఆఫ్రికా జట్టుపై ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న భారత మహిళా క్రికెట్ జట్టుకు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అభినందనలు తెలియజేశారు. ఫైనల్ మ్యాచ్‌లో మన అమ్మాయిల ఆటతీరును చూసి భారతావని గర్విస్తోందన్నారు. ఇలాగే మరిన్ని విజయాలతో దేశ కీర్తి ప్రతిష్టలను మున్ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
అద్భుతమైన విజయం: మంత్రి కొలుసు పార్థసారథి
మహిళల అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో విజయం సాధించిన భారత జట్టుకు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. దక్షిణాఫ్రికా జట్టుపై భారత మహిళా జట్టు అద్భుతమైన ఆటను ప్రదర్శించి 9 వికెట్లతో ఘన విజయం సాధించిందన్నారు. మహిళల జట్టు ఇటీవల వరుస విజయాలు సాధించడం వారి పోరాట పటిమకు నిదర్శనం అని కొనియాడారు. జుట్టులో తెలుగమ్మాయి త్రిష చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకుని రాణించడం మనందరికీ గర్వకారణం అన్నారు. ఈ క్రికెట్ జట్టు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానన్నారు.
చారిత్రాత్మక విజయం: మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి
మహిళల అండర్ – 19 టీ 20 ప్రపంచ కప్ పోటీల్లో విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. డిపెండిరగ్ ఛాంపియన్‌గా వరల్డ్ కప్ ఫైనల్ లో అడుగుపెట్టిన భారత టీమ్.. అద్భుతమైన పోరాట పటిమతో దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో.. వరుసగా రెండోసారి భారత్ విశ్వవిజేతగా నిలవడంలో.. అసాధారణ ప్రతిభ కనబరిచిన తెలుగు క్రికెటర్ గొంగడి త్రిషపై మంత్రి ప్రశంసలు కురిపించారు. టోర్నీ ఆద్యంతం తన ఆట తీరుతో ఆకట్టుకుని.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ – ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన గొంగడి త్రిష.. యావత్ మహిళా లోకానికి ఆదర్శప్రాయమని కొనియాడారు. వరుసగా రెండోసారి విశ్వ విజేతగా భారత మహిళల క్రికెట్ టీమ్ గెలుపొందడం భారతీయులుగా మనందరికీ గర్వకారణమన్నారు.