- గత ప్రభుత్వం అన్యాయంగా నిలిపేసింది
- గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి
- కేంద్ర సహాయమంత్రి పెమ్మసానికి వినతి
మంగళవారం(చైతన్యరథం): ఉపాధి హామీ కింద 2014-19 మధ్య కాలంలో గుత్తేదారులు చేసిన పనులకు సంబంధించిన బిల్లులను గత వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు గా నిలిపివేయడంతో నష్టపోయారని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూ ర్తి తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం చేసిన పనులను వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా రద్దు చేయడం దుర్మార్గమన్నారు. కక్షపూరితంగా గుత్తేదారులను గత ఐదేళ్లలో వైసీపీ నేతలు వేధించడం వల్ల దాదాపు 55 మంది చనిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ బాధ్యత తీసుకుని క్యాబినెట్‌లో తీర్మానం చేసి రూ.330 కోట్లు విడుదల చేయడానికి మార్గం సుగమనం చేశారు. ఆ నిధులను విడుదల చేయడానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ వారు అప్లోడ్ చేయగా అందులో రూ.222 కోట్లకు సంబంధించిన పనులను క్లోజ్ చేసినట్లుగా గు ర్తించారు. గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా కేంద్రానికి సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల బిల్లులు చేయడానికి అవరోధంగా మారిందని గురుమూర్తి తెలిపారు. దీనికి సంబంధించి ఆ శాఖ కమిషనర్ కార్యాలయం వారు కేంద్ర ప్రభుత్వానికి క్లోజ్ చేసిన పనులను ఓపెన్ చేయాలని లేఖ కూడా రాశారని వివరించారు. అదే విషయాన్ని గ్రామీ ణాభివృద్ధి, పంచాయతీరాజ్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసి తిరిగి బిల్లులు చెల్లించటానికి అనువుగా సైట్ ఓపెన్ చేయించి గత ప్రభుత్వం నిలిపేసిన పెండిరగ్ బిల్లులను చెల్లించి ఆదుకోవాలని మాజీ ఉపాధి హామీ మండలి సభ్యురాలు మొవ్వ లక్ష్మీ సుభాషిణితో కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి గత ప్రభుత్వంలో నష్టపోయిన కాంట్రాక్టర్లను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.