- ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలి
- రద్దీకి అనుగుణంగా పక్కాగా ఏర్పాట్లు చేయాలి
- మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం ఆదేశం
- శ్రీకాళహస్తిలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
- క్యూలైన్లలో లడ్డూ ప్రసాదం, నీరు, పాలు, బిస్కెట్లు
- మహిళా భక్తులకు రవిక, పసుపుకుంకుమ, గాజులు
- 27న స్థానికులకు ఉచిత దర్శన భాగ్యానికి నిర్ణయం
శ్రీకాళహస్తి(చైతన్యరథం): ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ఆలయాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్, దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి మునిసిపల్ కమిషనర్ కార్యాలయం సమావేశ మందిరంలో శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధ న్‌రాజు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పలు శాఖల అధిపతుల తో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞాన ప్రసూనాంబ దేవి అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పనిచే యాలని సూచించారు. సామాన్య భక్తులకు మంచిగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శివరాత్రికి వారం ముందు, వారం తర్వాత కూడా భక్తుల రద్దీ ఉంటుందని తదనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అధికంగా భక్తులు రానున్న నేపథ్యంలో పక్కాగా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పా రు. రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని, వీఐపీల దర్శనాలకు టైం స్లాట్ ఏర్పాటుకు సమీక్షించాలని ఎమ్మెల్యే సూచనలు ఆహ్వానిం చదగినవని అన్నారు. భక్తులతో సిబ్బంది, ఆలయ అధికారులు దురుసుగా ప్రవర్తించ రాదని సూచించారు. బైపాస్ రోడ్‌కు సంబంధించి పెండిరగ్ భూసేకరణ సత్వరమే చేపట్టాలని కలెక్టర్‌కు, ఆర్డీవోకు సూచించారు. ఫెస్టివల్ పొలిటికల్ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు.
ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ పార్కింగ్ ప్రాంతాలు సక్రమంగా గుర్తించి ఉచితంగా మినీ వాహనాల ఏర్పాట్లు, దేవాలయం వద్దకు భక్తులను చేర్చేలా ఉండాలని సూచించారు. బైపాస్ రోడ్డుకు సంబంధించి పెండిరగ్ భూ సేకరణ అంశం పరిష్కారం దిశగా దేవాదాయ శాఖ నుంచి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే ఆలయ అభివృద్ధిలో భాగంగా దేవాలయ ప్రాంగణానికి ఆనుకుని ఉన్న భవనానికి నష్ట పరిహారం చెల్లించడానికి నిధులు కేటాయిస్తామని, సంబంధిత విస్తరణ పనులను చేపట్టాలని కలె క్టర్‌కు సూచించారు. 13 రోజుల మహాశివరాత్రి కార్యక్రమాలలో క్యూలైన్‌లో భక్తులకు లడ్డు ప్రసాదం. వాటర్ బాటిల్, పసిపిల్లలు ఉన్న మహిళలకు పాలు, బిస్కెట్లు అందించ నున్నట్లు తెలిపారు. మహా శివరాత్రి పర్వదిన సమయాలలో 24, 25, 26 మూడురోజు లలో జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకున్న ప్రతిఒక్క భక్తురాలికి రవిక, పసుపు కుంకుమ, గాజులు అందిస్తామని తెలిపారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. సుమారు 400 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 14 ఏళ్ల లోపు పిల్లలకు జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ బ్యాండ్ ఏర్పాటు చేసి తప్పిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 27న శ్రీకాళహస్తి స్థానికులకు టికెట్ లేకుండా ఉచిత దర్శనానికి అవకాశం కల్పిస్తు న్నామని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామికి పట్టువస్త్రాలు సమ ర్పించడానికి ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వీఐపీలకు ప్రత్యేక టైమ్ స్లాట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఏర్పాట్లకు అదనంగా అవసరమయ్యే నిధులను అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి స్థానికులకు ఉచిత దర్శన భాగ్యం, క్యూలైన్‌లో లడ్డు ప్రసాదాలు, రహదారి మరమ్మతులకు స్పందిం చిన మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
నైట్ విజన్ డ్రోన్ కెమెరాలు వినియోగం ద్వారా పర్యవేక్షణకు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు గిరి ప్రదక్షిణ ప్రాంతం రహదారి మరమ్మతులు చేయిస్తామని తెలిపారు. గుడిమల్లం ఆలయం వద్ద కూడా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మహాశివరాత్రి సమయంలో గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు నివారించ డానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సుమారు 8 నుంచి 10 లక్షల భక్తులు వచ్చే అవకాశం ఉందని..పర్యాటక శాఖతో సమన్వయం చేసి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. దర్శనం టోకెన్లు క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా పొందే విధంగా ఏర్పాట్లు చేపడుతున్నామని, అదనపు బస్సుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్‌మెంట్ తగినంత బందో బస్తు ఏర్పాటు చేపడతామని వివరించారు. డ్రోన్ పర్యవేక్షణ, కంట్రోల్ రూమ్ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. సమావేశానికి ముందు ఆలయానికి చేరుకున్న మంత్రులకు స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం వారికి దత్తాత్రేయ స్వామి వద్ద వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా ఆలయ ఈవో బాపిరెడ్డి శేష వస్త్రంతో సత్కరించా రు. ఉచిత అన్నదాన శాలలో భక్తులకు అన్నం వడ్డించిన మంత్రులు ఆహారం, ఇతర ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి, మండల ప్రత్యే కాధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.