- వైసీపీ పాపాలపై మేమే ధర్నాలు చేయాలి
- అసర్ నివేదికపై ఏం సమాధానం చెబుతారు
- తప్పుచేసిన వారిని శిక్షించాలని ప్రజల ఆకాంక్ష
- విద్యావ్యవస్థను లోకేష్ గాడిలో పెడుతున్నారు
- పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
అమరావతి(చైతన్యరథం): అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిన వైసీపీ ధర్నాలకు పిలువునివ్వటం సిగ్గుచేటని మాజీ మంత్రి, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాము చేసిన పాపాలపై వైసీపీ నేతలే ధర్నాలు చేయటాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. వైసీపీ హయాంలో విద్యా వ్యవ స్థ దుస్థితిపై అసర్ నివేదిక చూసి వైసీపీ నేతలు తలెక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. వైసీపీ అరాచకాలపై ధర్నాలు చేసే స్థాయిలో మేం ఉన్నాం.. కానీ ప్రభుత్వంలో ఉన్నందు న చేయలేకపోతున్నాం. వైసీపీ విధ్వంసం చేసిన విద్యావ్యవస్థకు మంత్రిగా నారా లోకేష్ పునరుజ్జీవం పోస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మార్చిలో 16 వేల పైచి లుకు పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది. పాడుబడ్డ విద్యావ్యవస్థను లోకేష్ అనతి కాలంలోనే ప్రక్షాళన చేశారు. గత ప్రభుత్వంలో విధ్వంసాలు, అక్రమాలు చేసిన వారిపై చర్యలకు రాష్ట్రమంతటా ఎదురు చూస్తుందని తెలిపారు. ఏ1, ఏ2 సహా మిగిలిన ఆ నలుగురు, తప్పు చేసిన ఏ ఒక్కరినీ ఉపేక్షించకుండా కఠిన చర్యలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని గుర్తుచేశారు. మీడియాలో సాక్ష్యాలతో సహా వైసీపీ అక్రమాలు, అవి నీతి రోజూ వెలుగు చూస్తున్నాయి. వైసీపీ చేసిన అరాచకాలపై త్వరగా చర్యలు ఉండాల ని మేం ధర్నా చేయాల్సిన పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.