- ఐదు రాష్ట్రాల మంత్రులతో గొట్టిపాటి సమీక్ష
- సబ్సిడీలు వినియోగించుకోవాలని తీర్మానం
- ఇతర మొండిబకాయిల వసూళ్లకు నిర్ణయం
- బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ పెంపునకు వినతి
- గ్రీన్ ఎనర్జీకి గ్రాంట్ పెంపునకు కేంద్రానికి విజ్ఞప్తి
అమరావతి(చైతన్యరథం): విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఐదు రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులతో వర్చు వల్గా సమావేశమయ్యారు. కేంద్ర ఇంధన శాఖ సూచనలతో ఆర్థికంగా నష్టాలు ఎదు ర్కొంటున్న వివిధ రాష్ట్రాల డిస్కంలను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా ఈ సమావే శం జరిగింది. తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు చెందిన విద్యుత్ శాఖ మంత్రులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో విద్యుత్ డిస్కంల ఆర్థిక పరిస్థి తులపై కీలకంగా చర్చించారు. బకాయిలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన డిస్కంల ను ఏ విధంగా లాభాలబాట పట్టించి ముందుకెళ్లాలనే దానిపై సమాలోచనలు జరిపారు. అదనపు నష్టాలు, ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి డిస్కంలకు రావాల్సిన, ఇతర మొండిబకాయిల వసూళ్లపై ముఖ్యంగా దృష్టి సారించాలని నిర్ణయిం చారు. దీంతో పాటు పీఎం సూర్యఘర్, కుసుమ్ వంటి పథకాలను ప్రోత్సహించి డిస్కం ల భారాలను తగ్గించేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభు త్వం నుంచి వస్తున్న సబ్సిడీలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తీర్మానించా రు. ఈ సమావేశంలో బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీని వెయ్యి మెగావాట్ల నుంచి రెండు వేల మెగా వాట్లకు పెంచాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కేంద్రాన్ని కోరారు. పునరుత్పా దక విద్యుదుత్పత్తిని రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా వినియోగించుకునేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు కేంద్ర గ్రాంట్‌ను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జెన్కో ఎండీ చక్రధర్‌బాబు, ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి చేకూరి, సీపీడీసీఎల్ సీఎండీ భాస్కం పాల్గొన్నారు.