- జాతిపిత ఆశయాలకు అనుగుణంగా పాలన
- గాంధీ మార్గంలో నడవాలని పిలుపు
మంగళగిరి(చైతన్యరథం): అహింసే పరమధర్మంగా సత్యం, న్యాయంతో భారతా వనికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ అని వక్తలు కొనియాడారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేశారని, గాంధీ మార్గంలో నడవాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, యువ నేత లోకేష్ ఆయన మార్గంలో నడిచి రాష్ట్రంలోని యువత, పేదలకు మంచి భవిష్యత్‌ను అందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వివ రించారు. ఈ కార్యక్రమంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, మండలి చీఫ్ విప్ పంచుమ ర్తి అనురాధ, ఏపీసీవోజీఎఫ్ చైర్మన్ గండి బాబ్జీ, ఎన్నారై వింగ్ రాజశేఖర్, కార్యాలయ కార్యదర్శి ఏవీ రమణ, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనే ని నరేంద్ర, టీడీపీ కార్యాలయ ఆహ్వాన కమిటీ సభ్యులు పర్చూరి కృష్ణ, హాజి హసన్ బాషా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.