- ఆ రాష్ట్రంలో ఉన్న రికార్డులను తెప్పించండి
- వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, మసీదుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయండి
- బారాషహీద్ దర్గా అభివృద్ధికి నిధులు విడుదల చేయండి
- సీఎం చంద్రబాబుకు ఏపీ వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ వినతి
అమరావతి (చైతన్యరథం): తెలంగాణ వక్ఫ్ బోర్డ్ నుంచి రావాల్సిన 50 కోట్ల రూపాయల పెండిరగ్ బకాయిలను ఇప్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ఏపీ వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును గురువారం అబ్దుల్ అజీజ్ కలిసి పలు సమస్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్‌బోర్డ్‌కు చెందిన అన్ని రికార్డులు (డిజిటల్ రికార్డులతో సహా), పత్రాలు తెలంగాణ నుంచి బదిలీ చేయలేదని, ఆస్తులను అప్పగించలేదని తెలిపారు. చాలా వ్యాజ్యాలు / కోర్టు కేసులకు ఆ ఫైళ్లలో సమాచారం అవసరమని పేర్కొన్నారు. ఏపీ వక్ఫ్‌బోర్డు వద్ద రికార్డులు లేని కారణంగా చట్టపరమైన విషయాలలో కౌంటర్లు దాఖలు చేయలేకపోతున్నామని వివరించారు. త్వరితగతిన ఏపీ వక్ఫ్ బోర్డుకు చెందిన రికార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
2024-25 సంవత్సరానికి గాను మసీదుల ప్రహరీ గోడలు, శ్మశానాలు, ఈద్గాలు, అషూర్ ఖానాలు, దర్గాలు, తదితర నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ.10 కోట్లు, వక్ఫ్ ఆస్తులను ఆక్రమణల నుండి రక్షించేందుకు చర్యలు తీసుకోవడానికి, ఆస్తులకు ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డ్‌ల ఏర్పాటు, తదితర చర్యలకు రూ. 50 కోట్లు, హై కోర్టు, వక్ఫ్ ట్రిబ్యునల్, అపెక్స్ కోర్ట్‌ల్లో కేసులను వాదించడానికి చట్టపరమైన ఖర్చుల ఖర్చు కోసం రూ.5 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అలాగే ఏపీ ఆన్లైన్ సంస్థకు ఇవ్వాల్సిన పెండిరగ్ బకాయిలను చెల్లించాలని కోరారు. 2014లో నెల్లూరు లోని బారా షహీద్ దర్గా ప్రాంగణంలో రొట్టెల పండుగ-ఇస్లామిక్ కన్వెన్షన్ సెంటర్ అభివృద్ధి, ఇతర అనుబంధ అభివృద్ధి కోసం రూ.20 కోట్లు విడుదల చేశారని, దానిని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని తెలిపారు. బారా షహీద్ దర్గా అభివృద్ధికి సంబంధించి గత ఏడాది ప్రకటించిన రూ.5 కోట్లు విడుదల చేయాలని అబ్దుల్ అజీజ్ కోరారు.