అమరావతి (చైతన్యరథం): విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖ ఉక్కు పునరుజ్జీవానికి నిధులు కేటాయించటంతో పాటు, ఉత్తరాంధ్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నేరవేరుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ప్రజల కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, ఈ అంశాల్లో నిబద్ధతతో పని చేస్తుందని ఎక్స్‌లో మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు.