అమరావతి (చైతన్యరథం): సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశానికి స్వాతంత్య్రం సాధించిన జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. అహింస అనే ఆయుధంతో సూర్యడస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడిరచి భరతమాత దాస్యశృంఖలాల నుంచి విముక్తి కలిగించిన మహోన్నతుడు మహాత్మాగాంధీ అని మంత్రి లోకేష్ కొనియాడారు. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మహాత్మాగాంధీ ఒకరన్నారు. నమ్మిన సిద్ధాంతాలను గాంధీజీ స్వయంగా ఆచరించి చూపారు. భారతదేశంపై చెరగని ముద్ర వేశారు. దేశానికి స్వాతంత్య్ర ఫలాలు అందించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం కృషిచేద్దామని ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ పిలుపు ఇచ్చారు. ఇటా ఉంటే ఉండవల్లి నివాసంలో మహాత్ముని చిత్రపటానికి పూల మాలలు వేసి మంత్రి లోకేష్ ఘనంగా నివాళులర్పించారు.