- సంస్కరణల అమల్లో ఏపీ ముందడుగు
- సీఎం చంద్రబాబు విజనే దేశానికి దిక్సూచి
- కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్
- కేంద్ర మంత్రులతో వేదిక పంచుకునే అవకాశం
(చైతన్యరథం) : పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూటమిగా పని చేస్తున్నాయని కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. న్యూఢల్లీిలో జరుగుతున్న అఖిల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రులతో వేదిక పంచుకునే అవకాశం దక్కడం విశేషంగా భావిస్తున్నానన్నారు. వివిధ రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ కార్మిక సంస్కరణలు అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందంజలో ఉందన్నారు. విజనరీ లీడర్ నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో కార్మిక సంస్కరణలు 2015 నుండే అమలు చేశారన్నారు. వాటినే ఇప్పుడు కేంద్రం చాలా వరకు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ఆకర్షణతో పారిశ్రామికీకరణలో ముందంజలో ఉండడంతో పాటు కార్మికుల సంక్షేమం పట్ల కూడా ఎంతో శ్రద్ధ వహిస్తోందని ఆయన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా రూ.4 వేల నుండి రూ. 15 వేల వరకు పెన్షన్లను అందిస్తున్నామన్నారు. ఇది దేశంలోనే అత్యధికమన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వరకు బీమా అందిస్తున్నామని ఇది కూడా దేశంలోనే అత్యధికమని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల ప్రజల పట్ల, కార్మికుల పట్ల ఉండే నిబద్ధతకు ఇది నిదర్శనం అని కేంద్రమంత్రులు కొనియాడారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర సాధన -2047 లక్ష్యంగా ఒక విజన్‌తో పనిచేస్తున్నారన్నారు. వికసిత్ భారత్‌లో స్వర్ణాంధ్రను భాగ్యస్వామ్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాల పెంపు, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా, అభివృద్దే తారక మంత్రంగా ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారన్నారు.