- 10.80 ఎకరాల్లో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం
- 365 రోజులూ నేతన్నలకు పనికల్పించడమే లక్ష్యం
- బీసీ సంక్షేమం, చేనేత జౌళి మంత్రి సవిత
- ఆ శాఖ కమిషనర్ రేఖారాణితో స్థల పరిశీలన
అమరావతి(చైతన్యరథం): మంగళగిరిలో ఆటోనగర్‌ను ఆనుకుని మెగా హ్యాం డ్లూమ్ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. చేనేత కార్మికులకు 365 రోజులు భృతి కల్పించే లక్ష్యంలో భాగంగా ఆ పార్కు ఏర్పాటుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడిరచారు. తమిళనాడులోని కంచి తరహాలో దానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. బుధవా రం మంగళగిరి ఆటోనగర్‌కు ఆనుకుని ఉన్న 10.80 ఎకరాలను చేనేత జౌళిశాఖ కమిషనర్ రేఖారాణితో కలిసి మంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వం నుంచి ఐదేళ్లు ఎటువంటి సాయమూ అందకపోవడంతో పాటు ఉత్పత్తి అయిన వస్త్రాలు విక్రయించే మార్కెట్ సదుపాయం లభించకపోవడంతో ఎందరో నేతన్నలు అప్పుల పాలై తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు చేనేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారని విచారం వ్యక్తం చేశారు. టీడీపీ పాలనలో చేనేతలకు ఎంతో మేలు జరి గిందన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు అధికారంలో ఉండగా 2014-19లో చేనేతకు స్వర్ణయుగమన్నారు. వారి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచే శారు. నూలు కొనుగోలుకు రాయితీ, ఉచిత విద్యుత్ సదుపాయం, ముద్ర రుణాలతో పాటు త్రిఫ్ట్ పథకం అమలు చేశారని తెలిపారు. ఆనాటి ప్రయోజనాలతో పాటు మరి కొన్ని కొత్త పథకాలను నేతన్నలకు అందివ్వాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నిర్ణయించారని మంత్రి తెలిపారు. నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. దీనిలో భాగంగా ప్రభుత్వపరంగా ఆర్థిక దన్ను అందించడంతో పాటు 365 రోజుల పాటు పని కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గడిచిన ఏడు నెలల కాలంలో రాష్ట్రంతో పాటు దేశంలోని పలు నగరాల్లో చేనేత బజార్లు ఏర్పాటు చేసి చేనేత వస్త్రా ల విక్రయాలు పెరిగేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. అదే సమయంలో రాష్ట్రంలో నూతన టెక్స్టైల్స్ పాలసీకి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వీవర్ శాలలతో పది నూతన క్లస్టర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. హ్యాండ్లూ మ్, టెక్స్టైల్స్ పార్కుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో విశాఖలో 5 ఎకరాల్లో యూనిటీ మాల్‌ను ఏర్పాటు చేయబోతు న్నట్లు చెప్పారు. స్థల పరిశీలనలో చేనేత, జౌళి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.