- ఉద్యోగాల కల్పనకు కంపెనీలతో ఎంవోయూలు
- జగన్‌రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం
- తప్పులను సమర్థించుకుంటూ బురదజల్లే యత్నం
- గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి
అమరావతి(చైతన్యరథం): గత ప్రభుత్వంలో అన్ని రంగాల్లో నాశనమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తుందని గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల మంత్రి కొలుసు పార్ధసారథిó వెల్లడిరచారు. బుధవారం సచివాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృ ద్ధిని శరవేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు గత ఏడునెలల్లో రాష్ట్రానికి రూ.6.33 లక్ష ల కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకోవ డం జరిగిందని తెలిపారు. దాంతో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పారు. ముఖ్యంగా విశాఖలో టీసీఎస్, ఎన్టీపీసీ, ఆర్సె లార్ మిట్టల్, హెచ్పీసీ, రిలయన్స్ వంటి కంపెనీలు భారీఎత్తున పెట్టుబడులు పెట్టను న్నాయని చెప్పారు. గత ప్రభుత్వంలో చేసిన చేసిన తప్పులను సమర్థించుకుంటూ వైసీపీ నేతలు తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికపై ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇస్తే దానిపై విమ ర్శలు చేయడం సరికాదని ఖండిరచారు.
జగన్‌రెడ్డి వల్లే రాష్ట్రం నాశనం
ఒక వ్యక్తి మూర్ఖత్వ పాలనతో ఏ రాష్ట్రమైనా, దేశమైనా నష్టపోతుందనేందుకు గత ప్రభుత్వ పాలనే నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచకపోగా అన్ని రంగా ల్లో అధోగతి పాలు చేసి సుమారు రూ.10 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి రూ. 2800 కోట్లు, అంగన్వాడీల్లో చిన్న పిలల్లకు అందించే చిక్కీలు, గుడ్లకు సంబంధించి రూ.1700 కోట్లు, ఉద్యోగులకు సంబంధించి రూ.20 వేల కోట్లు బకాయిలు చెల్లించ లేదని వివరించారు. అదేవిధంగా గృహ నిర్మాణానికి సంబంధించి రూ.7,800 కోట్లు, ఉపాధి హామీ పథకానికి రూ.2100 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిందన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా పెద్దఎత్తున బకాయిలు చెల్లించలేదని తెలిపారు. రైతుల నుంచి కొను గోలు చేసిన ధాన్యానికి కూడా సకాలంలో సొమ్ము చెల్లించ లేదని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం మొత్తం కుదేలైందని, చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను ఎక్కడికక్కడే నిలిపివేయడం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఏపీకి జీవనాడైన పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తిగా నిర్ణక్ష్యం చేసిందన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు రూ.15 వేల కోట్లను కేంద్రం నుంచి మంజూరు చేయించుకోగలిగామని తెలిపారు. అమరావతి రాజధాని పనులను గత ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టి నిర్లక్ష్యం చేసి మూడు రాజధానుల పేరిట అసలు రాజధానే లేకుండా చేసిందని మండిపడ్డారు. కూటమి రాగానే 7 మాసాల్లోనే ప్రపంచ బ్యాంకు, హడ్కో, జైకా తదితర సంస్థల ద్వారా రూ.31 వేల కోట్లు సాధించుకోగలిగామని చెప్పారు. సూపర్‌సిక్స్ హామీ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు విజయ వంతంగా అమలు చేయడం జరుగుతోందని, దానివల్ల 90 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందని తెలిపారు. గడిచిన ఏడు నెలల్లో ఏడేళ్ల అభివృ ద్ధిని చేసి చూపించిన దార్శనికుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు పూర్తి కాని, మరమ్మతులు చేయలేని గ్రామ, పట్టణ, రాష్ట్ర రహదారులను పూర్తిచేసి గుంతలు లేని ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలంది స్తున్నామని చెప్పారు.
హామీలు అమలు చేస్తూ మన్ననలు
ఓ వైపు అప్పుల కుప్ప, మరోవైపు గత ప్రభుత్వ బకాయిల తట్ట దర్శనమిస్తున్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఈ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొం దుతున్నారు. 1000 పెన్షన్‌ను పెంచడానికి గత ప్రభుత్వానికి ఐదేళ్లు పడితే.. కూట మి పాలనలో చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన రోజునే రూ.3 వేలు ఉన్న సామాజిక పెన్షన్‌ను రూ.4 వేలు చేశారు. ఇచ్చిన హామీ మేరకే ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ జరుగుతోందని తెలిపారు. ప్రతీ ఏటా మెగా డీఎస్సీ ప్రకటిస్తా నని హామీ ఇచ్చి ఒక్క ఏటా కూడా డీఎస్సీని పూర్తి చేయకుండా జగన్‌రెడ్డి హామీని గాలికి వదిలేస్తే.. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన రోజునే డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంతకం చేశారని గుర్తు చేశారు. పేదవారికి అన్నం పెట్టే లక్ష్యం తో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసివేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిని పునరుద్ధరించడం జరిగిందని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటైజేషన్ కాకుండా గత ప్రభుత్వం కనీస ప్రయత్నాలు చేయలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక దాని సంరక్షణకు అనేక ప్రయత్నాలు చేసి సాధించినట్లు తెలిపారు. కేంద్రం నుంచి రూ.11,500 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అంతేగాక విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే శంకు స్థాపన జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రతి ఇంటిలో ఒక ఎంటర్ ప్రెన్యూర్ను తీర్చిదిద్దే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.