గుంటూరు(చైతన్యరథం): గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపునకు బీజేపీ, టీడీపీ, జనసేన ముఖ్యనేతలు కృషి చేయా లని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఆలపాటి గెలుపు కోసం బుధవారం నగరంలో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పెమ్మసాని పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉండటం వల్ల రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్, మోదీ ఆధ్వర్యం లో కూటమి ప్రభుత్వం ప్రతి పథకాన్ని ప్రజలకు అందించడానికి పనిచేస్తున్నారు. కూటమిలో ఉన్న నాయకులు ఏకతాటిపైకి వచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల పాటి రాజేంద్రప్రసాద్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. నాటి ఎన్నికల్లో ఆలపాటి కూట మి అభ్యర్థికి పూర్తి సహకారం అందించి 50 వేల మెజారిటీతో తెనాలి సీటును గెలిపిం చిన విషయాన్ని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా ప్రజలకు ఏది కావాలన్నా మంత్రిగా తాను సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా, జనసేన నుంచి గాదె వెంకటేశ్వరరావు, బోనబోయిన శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు, డేగల ప్రభాకర్, పిల్లి మాణిక్యాలరావు కూటమి ప్రధాన నాయకులు పాల్గొన్నారు.