అమరావతి(చైతన్యరథం): అక్రిడిటేషన్ల జీవోపై కసరత్తు పూర్తయిందని, త్వర లోనే జీవో విడుదల చేసి సకాలంలో మంజూరు చేస్తామని సమాచార పౌర సంబంధాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. బుధవారం సచివాలయంలో తనను కలిసిన ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందా నికి మంత్రి ఆ మేరకు హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన బృందంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జయరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చావా రవి, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి. సురేష్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. అక్రిడిటేషన్ల సంఖ్యను కుదించడం కోసం గత ప్రభు త్వం విధించిన అడ్డగోలు నిబంధనలను తొలగించి అర్హులైన జర్నలిస్టులందరికీ మంజూరు అయ్యేలా చూడాలని యూనియన్ నాయకులు మంత్రికి విజ్ఞప్తి చేశా రు. జిల్లాల్లో అక్రిడిటేషన్ కమిటీలకు గతంలో ఉన్న విచక్షణాధికారాలను పునరు ద్ధరించాలని, జీవో విడుదలలో జాప్యం లేకుండా చూడాలని కోరారు. వారి వినతు లకు మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే జీవో విడుదల చేసి అర్హు లందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి ప్రొఫెసర్ జి.అనితతో కూడా యూనియన్ నాయకులు భేటీ అయ్యారు.