- పునరుత్పాదక ఇంధన లక్ష్యాల సాధనకు నిబద్ధతతో భారత్ అడుగులు
- ప్రపంచంలోనే మేటిగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ చర్యలు
- వాతావరణ పరిష్కారాలపై రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్
దావోస్ (చైతన్యరథం): ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలను అధిగమించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు క్లీన్ ఎనర్జీ రంగంలో భారీగా పెట్టుబడులు అవసరమవుతాయని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 2030 నాటికి వాతావరణ పరిష్కారాల కోసం ప్రైవేట్ పెట్టుబడి వ్యూహాలను సిద్ధం చేయడంపై రెన్యూ యాన్యువల్ లీడర్స్ ఫోరం ఆధ్వర్యాన దావోస్ హార్డ్ రాక్ హోటల్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో రెన్యూ చైర్మన్, సీఈఓ సుమంత్ సిన్హా, బ్రెజిల్ వాతావరణ విభాగం కార్యదర్శి అంబాసిడర్ ఆండ్రో కొరియా డొ లాగో, ఇంటర్నల్ ఎనర్జీ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఫతి బిరోల్ పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… పునరుత్పాదక ఇంధనం, వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి 2030 నాటికి సంవత్సరానికి 4 ట్రిలియన్ డాలర్ల అవసరమని అంచనాగా ఉందన్నారు. 2050 నాటికి క్లీన్ హైడ్రోజన్ డిమాండ్ 125 – 585 Mtpa మధ్య ఉండవచ్చు. అప్పటికి గ్రీన్ హైడ్రోజన్ ప్రపంచ సరఫరాలో 50 నుంచి 65శాతంతో ఆధిపత్యం చెలాయిస్తుంది. గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్ పరిమాణం 2024లో 6.49 బిలియన్ డాలర్లను అధిగమించింది. 2032 వరకు ఇది సగటున 31 శాతం పెరుగుతుందని అంచనా ఉందని మంత్రి లోకేష్ చెప్పారు.
భారతదేశ పునరుత్పాదక శక్తి సామర్థ్యం 2024లో 200 GW మైలురాయిని అధిగమించింది. 2030 నాటికి 500 GWకి చేరుకోవాలన్న నిబద్ధతతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సౌర శక్తిని ప్రోత్సహించడానికి భారతదేశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA) సహ-స్థాపన చేసింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్.. స్టీల్, సిమెంట్, కెమికల్స్ వంటి క్లిష్టమైన రంగాలను లక్ష్యంగా చేసుకుని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతిలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షలకు పైగా ఉద్యోగాలు సాధించాలన్న కృతనిశ్చయంతో ఉంది. సౌర వ్యవసాయం, గ్రామీణ విద్యుదీకరణ కార్యక్రమాల కోసంPM-KUSUM వంటి కార్యక్రమాలు అమలుచేస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు.
డీకార్బనైజ్డ్ ఎకానమీకి బెంచ్‌మార్క్ సెట్ చేస్తూ పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచ అగ్రగామిగా అవతరించేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. సౌర, పవన శక్తి, వరుసగా 4.2 GW, 4.1 GW సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి వెన్నెముకగా నిలుస్తాయి. 1 GW కర్నూల్ అల్ట్రా మెగా సోలార్ పార్క్ వంటి ప్రముఖ ప్రాజెక్టులతో సహా, 4 GW కెపాసిటీని కలిగిన ఉన్న 4 సోలార్ పార్క్‌లు ఏపీికి రాబోతున్నాయి. 34 GW సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ పవర్ (ూూూ) ప్రాజెక్టుల కోసం 29 ప్రాంతాలను గుర్తించింది. సోలార్, విండ్, సోలార్-విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టుల కోసం 80,000 ఎకరాల భూమిని సర్వే చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 5230 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ (PSP) త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 2030 నాటికి 18 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖపట్నం, కృష్ణపట్నంలలో 30 మెగావాట్ల సామర్థ్యంతో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లను ప్రతిపాదించాం. స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్ (IRESP)-2023లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందని మంత్రి లోకేష్ చెప్పారు.