మంగళగిరి(చైతన్యరథం): స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవ స్థాపకుడు సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని టీడీపీ కేంద్ర కార్యా లయం లో గురువారం నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ నేతాజీగా ప్రజల హృదయాల్లో నిలిచి పోయిన సుభాష్ చంద్రబోస్ ధైర్యం, కృషి, త్యాగం భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని పేర్కొన్నారు. ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాన్ని వదలిపెట్టి స్వాతంత్య్రం కోసం కదనరంగంలోకి దూసుకెళ్లిన ఆయన ధైర్యం అందరికీ ఆదర్శనీయ మని కొనియాడారు. ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్ పాలకులను మనదేశం నుంచి తరిమికొట్టడంలో ఆయన తెగువ అనిర్వచనీయమన్నారు. మీ రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను అన్న నేతాజీ నినాదం దేశ ప్రజలను ఉర్రూ తలూగిం చిందని గుర్తుచేశారు. సుభాష్ చంద్రబోస్ నడిపించిన ఉద్యమం యువతను స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములయ్యేందుకు ప్రేరణ కలిగించిందని పేర్కొన్నారు. నేతాజీ ఆశ యాల కోసం ప్రతిఒక్కరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యాక్రమంలో విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్లరామయ్య, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, టీడీపీ సీని యర్ నాయ కులు ఏవీ రమణ, కోడూరి అఖిల్‌కుమార్, పర్చూరి కృష్ణ, హసన్‌బాషా, ఎస్.పి.సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.