- మూడు కట్టర్ల ద్వారా నిర్మాణం పూర్తికి చర్యలు
- అవసరమైన పునరావాస పనులకు ప్రతిపాదనలు
- ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో మౌలికవసతులు కల్పించాలి
- జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
- పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన
పోలవరం(చైతన్యరథం): పోలవరం ప్రాజెక్టులో ప్రధానమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను గురువారం జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారన్నారు. ఆ మేరకు అధికారులతో సమన్వయం చేసుకుని ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యాలను నిర్దేశించడం జరిగిం దని తెలిపారు. 2025 నాటికి 41.15 మీటర్లకు పునరావాస పనులు పూర్తి చేసేందుకు ఇటీవల వెయ్యి కోట్లు నిర్వాసితులకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని చెప్పారు. రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తుకు పూర్తిచేసేందుకు అవసరమైన పునరావాస పనులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా మన్నారు. ఫిబ్రవరి 1 నుంచి రెండో కట్టర్ పని ప్రారంభిస్తుందని, మూడో కట్టర్ ఏప్రిల్ నాటికి వస్తుందన్నారు. మూడు కట్టర్ల ద్వారా త్వరితగతిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. షెడ్యూల్ ప్రకారమే జనవరిలో డయా ఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించామని వెల్లడిరచారు.
గతంలో కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి ధ్వంసం చేశారన్నారు. తుగ్లక్ పాలనతో పోలవరం పనులు ఎంతో వెనుకపడ్డాయన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వల్ల మరో రూ.వెయ్యి కోట్ల ప్రభుత్వంపై భారం పడిరదన్నారు. వాల్ నిర్మాణం సగం పూర్తవగానే ఈసీఆర్‌ఎఫ్ నిర్మాణ పనులు కూడా మొదలుపెడతామని తెలిపారు. పోలవ రం నిర్వాసితులను గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు. నిర్వాసితులకు న్యాయం చేసి 2027కి పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు మంత్రి డయా ఫ్రమ్ వాల్ ప్రాంతంలో జరుగుతున్న పనులు పరిశీలించారు. యంత్రాల పనితీరు గురిం చి బావర్ కంపెనీ ప్రతినిధులు వివరించారు. బెంటో నైట్ మిశ్రమం ప్లాంటును పరిశీ లించారు సమీపంలోని ప్రయోగశాలను సందర్శించి ప్యానెల్ తవ్వకాల్లో వస్తున్న మెటీరి యల్ పరిశీలించారు. ప్రాజెక్టు సీఈ నరసింహమూర్తి నుంచి వివరాలను తెలుసుకు న్నారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. 2026 జూలై నాటికి నిర్వాసితు లను తరలించడంతో పాటు ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో మౌలికవసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కాలనీల్లో దేవాలయాలు, శ్మశానాలు నిర్మించలేదనేది తన దృష్టికి వచ్చిందని, వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఆర్‌అండ్‌ఆర్‌లో సిబ్బంది ఖాళీలు వెంటనే భర్తీ చేయాలన్నారు. వచ్చే వారం పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే అవకాశం ఉందని, అప్పటికి అన్ని వివరా లు సిద్ధం చేయాలన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ బకాయిలను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగానే ఉందన్నారు. ప్రతినెలా పునరావాస కాలనీల పనుల పురోగతిని కనబరచాలన్నారు. చింతూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ప్రస్తు తం నిర్వశిత కాలనీలలో పనులు జరుగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ట్రైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాసులు, జలవనరుల శాఖ గౌరవ సలహాదారు ఎం .వెంకటేశ్వరరావు, పోలవరం ప్రాజెక్ట్ సీఈ కె.నరసింహమూర్తి, ఎస్‌ఈ ఆర్.రామచంద్ర రావు, చింతూరు పీవో అపూర్వ భరత్, రంపచోడవరం సబ్‌కలెక్టర్ కలపశ్రీ, కేఆర్ పురం ఐటీడీఏ పీవో, కె.రాములనాయక్, జంగారెడ్డిగూడెం ఆర్టీవో ఎం.వి.వెంకటరమణ, మెగా కంపెనీ అధికారులు, అంగర సతీష్, మురళీధర్, చింతూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగమణి, ఈఈలు పి.వెంకటరమణ, పి.వెంకటేశ్వరరావు, ఏలూరు భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.ముక్కంటి, మాజీ ఏఎంసీ చైర్మన్, పి.రామారావు తదితరులు పాల్గొన్నారు.