దావోస్ (చైతన్య రథం): దావోస్‌లో మిట్టల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్, సీఈఓ ఆదిత్య మిట్టల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సమావేశమయ్యారు. ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌ను రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడితో ఏపీలో నెలకొల్పేందుకు ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే అంశంపై ముఖ్యమంత్రి బృందం మిట్టల్ బృందంతో చర్చలు జరిపింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికపై పోస్టు చేస్తూ `చర్చలు సానుకూలంగా ముందుకు సాగాయని పేర్కొన్నారు.