- గత ప్రభుత్వం పూర్తికాకుండానే ప్రారంభించింది
- మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి
విజయవాడ(చైతన్యరథం): అసంపూర్తిగా ఉన్న అంబేద్కర్ స్పృతివనం పనులు వేగవంతం చేసి త్వరలోనే పూర్తి చేస్తామని సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. మంగళవారం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామ హేశ్వరరావుతో కలిసి నగరంలోని అంబేద్కర్ స్మృతివనాన్ని సందర్శించి మిగిలిపోయి న పనులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధానిలో దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు 2014 `19లో టీడీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందుకనుగుణంగా అమరావతి లో స్థలం కేటాయించి నిర్మాణ పనులు కూడా ప్రారంభించినట్లు చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ను పక్కన పెట్టి విజయవాడలో అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేసింది. పనులు పూర్తికాక ముందే ప్రారంభించి ప్రజలను మోసం చేశారు.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి చాలా పనులు పెండిరగ్లో ఉన్నాయి. ఆ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని వివరించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తోందని తెలిపారు.