- ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది
- గ్రీన్ ఎనర్జీకి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్
- అనకాపల్లిలో కొత్త స్టీల్ ప్లాంటుకు చర్యలు
- దావోస్ పర్యటనలో ఒప్పందం కుదిరింది
- స్టీల్ ప్లాంటు కబ్జాకు జగన్ ముఠా యత్నం
- ఉత్తరాంధ్రను దోపిడీ చేసి నాశనం చేశారు
- ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
విశాఖపట్నం(చైతన్యరథం): లక్షల మంది పోరాటం, వందల మంది ప్రాణ త్యాగాల తో విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించుకున్నాం..అలాంటి పరిశ్రమను ఆదుకునేలా కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఇవ్వడం సంతోషంగా ఉందని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గంటా శ్రీనివాసరావు వంటి వారు రాజీనామాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కార్మికులు వందల రోజులుగా చేపట్టిన దీక్షలకు ఫలితం దక్కిందని పేర్కొం టూ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదానికి చంద్రబాబు మరోసారి ప్రాణప్రతిష్ఠ చేశారని తెలిపారు. గతంలోనూ విశాఖ ఉక్కును కాపాడేందుకు చంద్రబాబే పోరాడారు.. ఇప్పుడు కూడా చంద్రబాబు చొరవతోనే నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. గత ఐదేళ్లు జగన్‌రెడ్డి విశాఖ ఉక్కును ఏ విధంగా కబ్జా చేయాలా అని ఆలోచించారే తప్ప ఆదుకోవడానికి ప్రయత్నించలేదని మండిపడ్డారు. దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీతో చీకటి ఒప్పందాలు చేసుకుని భూములు కొట్టేయాలనుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖ ఉక్కుకు మాంగనీసు గనులను 50 సంవత్సరా లకు కేటాయించినట్లు తెలిపారు. విశాఖ వాసుల చిరకాల కోరిక అయిన రైల్వేజోన్ గత ఐదేళ్లు ఎందుకు పూర్తి చేయలేదో జగన్‌రెడ్డి, వారి ముఠా సమాధానం చెప్పాలని ప్రశ్నిం చారు. కూటమి అధికారంలోకి రాగానే రైల్వే జోన్ కోసం 52 ఎకరాలు కేటాయించి పనులు ప్రారంభించినట్లు చెప్పారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను వేగవంతం చేశామని, 2026 నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విశాఖ కేంద్రంగా రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రధాని నరేంద్ర మోదీ తాజా పర్యటనలో శ్రీకారం చుట్టారు.
గ్రీన్ ఎనర్జీకి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్
గ్రీన్ ఎనర్జీకి ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా చేసేలా పనులు చేపట్టాం. అనకాపల్లిలో కొత్త స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా దావోస్‌లో ఈ రోజే చంద్రబాబు ఒప్పందం చేసుకు న్నారు. గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు, ఉపాధికి కేంద్రంగా నిలుపు తాం. రుషికొండకు బోడిగుండు కొట్టి రూ.500 కోట్ల ప్రజాధనంతో ప్యాలెస్ కట్టుకున్న దుర్మార్గుడు జగన్‌రెడ్డి. రూ.5 వేల కోట్ల విలువైన దసపల్లా భూములను కొల్లగొట్టే ప్రయ త్నం చేశాడు. రూ.1000 కోట్ల విలువైన వాల్తేరు క్లబ్ కొట్టేసేందుకు ప్రయ త్నించాడు. విశాఖలో టీసీఎస్ ఏర్పాటుకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాం. గూగుల్, అదానీ డేటా సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. స్టార్ట్ అప్ కంపెనీలకు అండగా నిలిచే లక్ష్యం తో నిర్మించిన మిలీనియం టవర్స్‌ను జగన్‌రెడ్డి కుట్ర పూరితంగా ఖాళీ చేయించాడు. పోలవరం ఎడమ కాలువను కూడా పూర్తి చేసి పోలవరం నుంచి బాహుదా వరకు అన్ని నదులను అనుసంధానిస్తాం. ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసి చూపిస్తాం. విశాఖ ఉక్కు చరిత్రలో, ఉత్తరాంధ్ర అభివృద్ధిలో చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం తథ్యమని స్పష్టం చేశారు.